ETV Bharat / sitara

13 ఏళ్ల తర్వాత 'రాములమ్మ' రీఎంట్రీ

స్టార్ హీరోయిన్​​గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించింది విజయశాంతి. లోక్​సభలోనూ అడుగుపెట్టింది. రాజకీయ నేతగా, పార్టీ ప్రధాన ప్రచారకర్తగా విభిన్న బాధ్యతల్ని నిర్వర్తించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు మహేశ్​బాబు సినిమాతో వెండితెరకు పునరాగమనం చేస్తోంది.

13 ఏళ్ల తర్వాత 'రాములమ్మ' రీఎంట్రీ
author img

By

Published : Jun 3, 2019, 7:31 AM IST

టాలీవుడ్​లో అగ్రహీరోలతో పోటీపడి నటించింది హీరోయిన్​ విజయశాంతి. అభిమానుల చేత 'లేడీ సూపర్​స్టార్' అని పిలిపించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు వెండితెరపై రీఎంట్రీకి సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి- మహేశ్​బాబు కాంబినేషన్​లో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

1998లోనే రాజకీయాల్లోకి ప్రవేశించినా 2006 వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది విజయశాంతి. అదే ఏడాది చివరిగా 'నాయుడమ్మ' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితమైంది. 2009లో ఎంపీగా గెలిచింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తించింది.

vjaya shanthi politician
రాజకీయ నేతగా విజయశాంతి

తన సినీ ప్రయాణంలో వివిధ భాషల్లో దాదాపు 180 చిత్రాల్లో నటించిందీ హీరోయిన్. 1991లో 'కర్తవ్యం' సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఈ చిత్రానికి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యూనిరేషన్​ తీసుకుంది. 'రాములమ్మ' చిత్రంలో అద్భుత నటనకుగాను విజయశాంతి ఉత్తమ నటిగా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.

heroine vijaya shanthi
హీరోయిన్​ విజయశాంతి

విశేషమేమిటంటే సూపర్ స్టార్ కృష్ణ చేసిన 'కిలాడి కృష్ణ' చిత్రంతో విజయశాంతి టాలీవుడ్​కు పరిచయమైంది. మళ్ళీ ఇప్పుడు ఆయన కుమారుడు మహేశ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది.

mahesh new movie poster
మహేశ్​బాబు కొత్త సినిమా పోస్టర్

అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' ఆర్మీ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కనుంది. మేజర్ పాత్రలో మహేశ్​బాబు కనిపించనున్నాడు. రష్మిక మందణ్న హీరోయిన్​. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్​రాజు నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇవీ చదవండి:

Pune (Maharashtra), June 02 (ANI): Hundred of members from lesbian, gay, bisexual, transsexual and queer (LGBTQ) community participated in the pride march organised in Pune, today. This was the ninth pride march held in Pune by LGBTQ community. Many foreign nationals from different countries also participated in this pride march. The march was flagged off from Balgandharva chowk in Pune. While speaking to ANI, a member of LGBTQ community said, "It is the most happy pride, the whole year has been super happy. We are still celebrating it". A foreign national present in the March said, "I think it is a good way to show the city and locals who are not really aware about this topic".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.