బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. తాజాగా, అతని నివాసం నుంచి సీసీటీవీ ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. అందులో పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది నటుడి మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు.. ఓ గుర్తుతెలియని మహిళ అపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ వీడియోపై విపరీతమైన చర్చ నడుస్తోంది.
నేరం జరిగిన స్థలంలో ఆ మిస్టరీ మహిళ నల్లని వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తిని కలిసింది. వారిద్దరూ ఏదో తెలియని వస్తువును మార్పిడి చేసుకున్నారు. అంతే కాకుండా ఒక నలుపు రంగు బ్యాగ్‌ను ఆమె అక్కడ విడిచి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.