Mahesh Babu: 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో కొత్త సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే.. దీన్ని ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులను సంతోషపెట్టే ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతోన్న కారణంగా వీలైనంత త్వరగా కొత్త సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసేయాలని మహేశ్‌బాబు భావిస్తున్నారట. దీంతో మహేశ్ - త్రివిక్రమ్‌ల సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా పూజా కార్యక్రమం వేడుకగా జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు మహేశ్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ప్రేమికుల రోజున 'సర్కారు వారి పాట' సందడి