ETV Bharat / sitara

ఐసీయూ కేంద్రంగా మారిన షారుక్​ కార్యాలయం! - srk khar office quarantine facility

బాలీవుడ్​ స్టార్​ షారుక్​ ఖాన్​ దంపతులు తమ వ్యక్తిగత కార్యాలయాన్ని కరోనా రోగుల చికిత్స నిమిత్తం బీఎంసీ అధికారులకు అందించారు. తాజాగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారి కోసం ఈ నివాసాన్ని ఐసీయుగా మార్చారు అధికారులు.

SRK's Khar office gets upgraded to 15-bed ICU facility
షారుఖ్​
author img

By

Published : Aug 9, 2020, 5:12 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నవేళ.. బాలీవుడ్​ స్టార్​ షారుక్ ఖాన్​ దంపతులు దాతృత్వం చాటుకున్నారు. తమ నాలుగు అంతస్తుల వ్యక్తిగత కార్యాలయాన్ని కరోనా రోగుల కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​కు ఇచ్చారు. దీనిని మహిళలు, చిన్నారులు, వృద్ధులకు క్యారంటైన్​ కేంద్రంగా ఉపయోగించారు అధికారులు. తాజాగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న రోగుల కోసం 15 పడకల ఐసీయూ యూనిట్​గా అప్​గ్రేడ్​ చేశారు. శనివారం నుంచే ఇక్కడ కార్యకలాపాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

షారుకు​, అతడి భార్య గౌరీ ఖాన్​ తమ కార్యాలయాన్ని ఏప్రిల్​లోనే బీఎంసీకి అప్పగించారు. అయితే వైద్యులు, సిబ్బంది కొరత వల్ల.. మే 29 వరకు భవనాన్ని వినియోగించలేదు. అనంతరం ఐసీయు సదుపాయాన్ని కల్పించడం కోసం జులై 15 నుంచి పనులు ప్రారంభించారు.. ఈ క్రమంలోనే ఐసోలేషన్​లో ఉంచిన రోగులను వేరే కేంద్రానికి తరలించారు.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సాయం చేసేందుకు షారుక్ దంపతులు చాలా కృషి చేశారు. తన ఐపీఎల్​ ఫ్రాంచైజీ కోల్​కతా నైట్​రైడర్స్​ ద్వారా పీఎం కేర్స్​ ఫండ్​కు సహకరిస్తానని షారుక్ తెలిపాడు. ఇప్పటికే రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్మెంట్​ ద్వారా ఈ జంట మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్​ ఫండ్​ను అందజేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.