బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఓ బయోపిక్‌లో నటించనున్నట్లు సమాచారం. అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలల ప్రాజెక్ట్‌లో ఆయన కథానాయకుడిగా అలరించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఉర్దూ కవి, సాహితీ రచయిత సాహిర్ లుధియాన్వి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్లో ఎన్నో పాటలతో సంగీత లోకాన్ని మైమరిపించిన లుధియాన్వి కథను సినిమాగా మలచాలని బన్సాలీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన జీవితాన్ని తెరకెక్కించడం చాలా పెద్ద బాధ్యతని, అందుకే తొందరపడదలుచుకోవడం లేదని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ కథకు సంబంధించి ప్రస్తుతం షారుక్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, ఇర్ఫాన్, అభిషేక్ బచ్చన్ నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం 'పఠాన్' చిత్రీకరణలో ఉన్న షారుక్ ఈ కవి బయోపిక్‌లో మెరుస్తారామో చూడాలి.
ఇదీ చూడండి: తొలిరోజు కలెక్షన్లతో 'ఉప్పెన' రికార్డు