ETV Bharat / sitara

2022లో షారుక్​ 'పఠాన్'​.. జాన్​ 'అటాక్'​ రిలీజ్​ ఖరారు - జాన్​ అబ్రహం రిలీజ్​ ఖరారు

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ నటిస్తున్న 'పఠాన్'​ సినిమా 2022లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ తెలిపారు. మరో హీరో జాన్​ అబ్రహం 'అటాక్'​ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది.

jon
జాన్​
author img

By

Published : Feb 21, 2021, 5:05 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ అభిమానులకు నిరాశ. ఆయన నటిస్తున్న 'పఠాన్'​ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం 2022లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ ట్వీట్​ చేశారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో ట్రెండింగ్​లో ఉంది.

ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్​మెంట్​‌ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రానికి యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ చిత్ర సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్‌ గతేడాది నవంబరులోనే ప్రారంభమైంది. ఇందులో జాన్‌ అబ్రహం కూడా ఉన్నారు. హీరో సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రల్లో నటించనున్నారని సమాచారం. డింపుల్‌ కపాడియా కీలక పాత్రలో నటిస్తోంది.

ఆగస్టు 13న అటాక్​..

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం 'అటాక్' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఆయన ట్వీట్​ చేశారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.