ETV Bharat / sitara

20 ఏళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో షారుక్​? - ఇజార్​

దాదాపుగా 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్​ కింగ్​ ఖాన్​ షారుక్​, దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ కాంబోలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. 'ఇజార్​' అనే ప్రేమకథా చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయని హిందీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది.

SRK all set to cycle to Norway for love?
20 ఏళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో షారుక్​?
author img

By

Published : May 9, 2021, 9:08 AM IST

బాద్​షా షారుక్​ ఖాన్​- విభిన్న చిత్రాల దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ కాంబోలో 20 ఏళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం 'దేవదాస్​'. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేయలేదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో 'ఇజార్‌' అనే ప్రేమకథా చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.

ఈ కథను నాలుగేళ్ల కిందటే షారుక్​తో కలిసి చేయాలనుకున్నారట సంజయ్‌. ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైక్లింగ్ చేసిన వ్యక్తి నిజ జీవిత ఆధారంగానే భన్సాలీ ఈ కథను తయారు చేసుకున్నారని సమాచారం. ఇందులో షారుక్​ ప్రేమ కోసం నార్వే వరకు సైక్లింగ్ చేసే పాత్రలో కనిపించనున్నారట. దర్శకుడు సంజయ్​ ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్​ చేస్తున్నారట.

SRK all set to cycle to Norway for love?
ప్రేయసి కోసం సైకిల్​పై నార్వే చేరుకున్న ప్రేమికుడు

అయితే ఈ కథకు షారుక్ అంగీకరిస్తారో! లేదో తెలియాల్సిఉంది. ప్రస్తుతం సంజయ్‌.. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హీరా మండి' అనే వెబ్‌ సీరీస్‌ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇక షారుక్​ ఖాన్‌ కూడా 'పఠాన్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా జాన్‌ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

నిజ జీవిత ప్రేమకథతో రానున్న షారుక్​

ఇదీ చూడండి: మెల్లామెల్లగా వచ్చిందే.. వచ్చి మనసులు దోచిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.