ETV Bharat / sitara

తొలిసారి సినిమా ఛాన్స్​ అలా వచ్చింది : శ్రియ - శ్రియ సంతోషం సినిమా ఆఫర్​

టాలీవుడ్ సీనియర్​ హీరోయిన్​ శ్రియ.. తొలిసారి వెండితెరపై మెరిసే అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. దీంతో పాటు పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Sriya
శ్రియ
author img

By

Published : Sep 23, 2020, 9:33 PM IST

ఓ వీడియో ఆల్బమ్‌ ద్వారా నటిగా పరిచయమై.. దక్షిణాదితోపాటు హిందీలోనూ గుర్తింపు పొందిన బ్యూటీ శ్రియ. నటనతోనే కాదు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకున్నారు ఈ భామ. రజనీకాంత్‌, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున.. ఇలా దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులోని విశేషాలు చూద్దాం..

  • నేను హరిద్వార్‌లోని ఓ చిన్న కాలనీలో పుట్టి, పెరిగా. అక్కడ వివిధ రకాల భాషల వాళ్లు ఉండేవారు. తమిళ్‌, తెలుగు.. ఇలా రకరకాల ప్రజలు జీవిస్తుండేవారు. వారిని చూస్తూ, మాట్లాడుతూ పెరిగా. డ్యాన్స్‌పై ఇష్టంతో శిక్షణ తీసుకున్నా. నా 16 ఏళ్ల వయసులో డ్యాన్స్‌ చేసే అమ్మాయి కావాలని కొందరు మా మాస్టర్‌ను కలిశారు. ఆయన వల్ల స్క్రీనింగ్‌ టెస్ట్‌కు వెళ్లా. ఓ మ్యూజిక్‌ వీడియో కోసం నన్ను తీసుకున్నారు. ఆపై దాన్ని చూసిన దర్శక, నిర్మాతలు నన్ను తెలుగు సినిమాలో నటించమని అడిగారు. హైదరాబాద్‌లో మాకు స్నేహితులు ఉన్నారు. వారి సహాయంతో ఇక్కడికి స్క్రీన్‌ టెస్ట్‌కు వచ్చా. 'సంతోషం' సినిమాకు నన్ను ఎంపిక చేశారు. నాకు సినిమాలో అవకాశం వచ్చే సరికీ అమ్మానాన్న చాలా సంతోషించారు. ఆపై తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ.. సినిమాల్లో నటించా.
  • నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. కథక్‌ నేర్చుకున్నా. దాని కోసం ప్రత్యేకంగా ముంబయి, దిల్లీకి చెందిన గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నా. డ్యాన్స్‌లో అనేక రకాలుంటాయి, ఆ ప్రక్రియలో చాలా సరదా ఉంటుంది. ఖాళీ సమయంలో డ్యాన్స్‌ చేస్తుంటా. కథక్‌ అంటే మూమెంట్స్‌ సింపుల్‌గా ఉంటాయి, కానీ కళ్లతో ఎమోషన్స్‌ చూపించాలి.
  • రజనీకాంత్‌ సర్‌తో కలిసి శివాజీ కోసం పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో నటించేటప్పుడు నేను చిన్న అమ్మాయిని. రజనీ ఓ సూపర్‌స్టార్‌. కానీ ఆయన సెట్‌లో చాలా మౌనంగా ఉంటారు. ఒంటరిగా, ప్రశాంతంగా, సౌమ్యంగా కూర్చుని ఉంటారు. మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఆయనకు హాస్యచతురత ఎక్కువ. ఇది చాలా మందికి తెలియదు. రజనీ సర్‌ ఎదుటి వ్యక్తితో స్నేహంగా మాట్లాడుతుంటారు. సినిమాపై మన అభిప్రాయాల్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. స్క్రిప్టు ఎందుకు నచ్చింది, ఎక్కడ నచ్చింది అని అడుగుతుంటారు.
  • నాగార్జున సర్‌తో కలిసి అనేక సినిమాల్లో నటించా. ఆయనకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. వర్కౌట్స్‌ ఎక్కువగా చేస్తుంటారు. హ్యాపీ పర్సన్‌. వృత్తిమీద అంకితభావం ఎక్కువ. ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. నాగ్‌ కుటుంబ సభ్యులతో కూడా నాకు పరిచయం ఉంది. అమల గారు అమేజింగ్‌.

ఇదీ చూడండి 'రంగే దే' షూటింగ్​లో నితిన్.. సంక్రాంతికి సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.