ETV Bharat / sitara

ఊహతో తొలి పరిచయం అప్పుడే: శ్రీకాంత్​ - శ్రీకాంత్ ఊహా తొలి పరిచయం

స్టార్​ కపుల్స్​ హీరో శ్రీకాంత్​, ఊహ జోడి.. వివాహబంధంలో అడుగుపెట్టి నేటితో 24 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఊహను పెళ్లి చేసుకోవడం వెనుక జరిగిన పరిణామాలను 'అలీతో సరదాగా' కార్యక్రమంలో హీరో శ్రీకాంత్​ వెల్లడించారు.

Srikanth and Ooha met for the first time during 'Aamey' filming
ఊహతో తొలి పరిచయం అప్పుడే: శ్రీకాంత్​
author img

By

Published : Jan 20, 2021, 12:42 PM IST

టాలీవుడ్​ స్టార్ కపుల్స్​లో హీరో శ్రీకాంత్​, ఊహ జోడి ప్రత్యేకం. 'ఆమె' సినిమా షూటింగ్​లో ప్రారంభమైన వీరిద్దరి పరిచయం.. కొన్నేళ్లకే ప్రణయానికి దారి తీసింది. వారిద్దరూ వివాహబంధంలో అడుగుపెట్టి నేటి(జనవరి 20)తో 24 వసంతాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పెళ్లికి ముందు తన భార్యను తొలిసారి చూసినపుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో? శ్రీకాంత్​ మాటల్లోనే తెలుసుకుందాం.

"ఆమె' సినిమా కోసం మేమిద్దరం తొలిసారి కలిసి పనిచేశాం. అయితే ఆ లేడీ ఓరియంటెడ్​ మూవీకి ఎవరైన పాపులర్​ హీరోయిన్​ను ఎంపిక చేస్తారని నేను అనుకున్నా. కానీ, ఒకరోజు ఊహ షూటింగ్​ సెట్లో అడుగుపెట్టింది. ఆమెను చూడడం అదే తొలిసారి. ఊహను చూసిన వెంటనే.. 'ఇంత లావుగా ఉంది ఏంట్రా?' అనుకున్నా. ఆ సినిమాతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మేము నాలుగు సినిమాలు చేశాం. అలా మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఊహతో పాటు ఆమె కుటుంబసభ్యులను పిలవడం.. మా ఇంట్లో వాళ్లకు పరిచయం చేయడం చేశా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా" అని శ్రీకాంత్​ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అభిమానుల హంగామాకు రౌడీ హీరో భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.