నందమూరి బాలకృష్ణ నటించి, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల'. ఇప్పటికే షూటింగ్ జరిగిన 17 నిమిషాల నిడివి గల సన్నివేశాల్ని వీడియో రూపంలో ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం, భీముడి గెటప్‌లో ఉన్న శ్రీహరి లుక్‌ను విడుదల చేశారు. అంతకు ముందు మంగళవారం అర్జునుడి పాత్రలోని బాలయ్య లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. సౌందర్య, శరత్‌బాబు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
దీనితో పాటే చిత్ర బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు బుధవారం ప్రకటించారు. ఈనెల 24 నుంచి రూ.50 చెల్లించి, శ్రేయస్ ఈటీ యాప్‌లో 'నర్తనశాల'ను వీక్షించొచ్చు. దీని ద్వారా వచ్చే మొత్తం బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్‌కు వెళ్లనుందని ఇప్పటికే బాలకృష్ణ చెప్పారు.
ఇవీ చదవండి: