పింక్ రీమేక్ 'నేర్కొండ పార్వై' తొలి రూపును చిత్రబృందంవిడుదల చేసింది. ఇందులో విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా వంటి ప్రముఖులు కనిపించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'కోలీవుడ్ నాకు చాలా ప్రత్యేకమైంది. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్లో సందడి చేశారు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా నిర్మించాలనేది నా భార్య కోరిక. ఈ విషయం మా మధ్య చర్చకు వచ్చినపుడు పింక్‌లో నటిస్తే బాగుటుందని అజిత్ సూచించారు. శ్రీదేవి అందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆయనతో ఈ చిత్రం నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది',
- నిర్మాత, బోనీ కపూర్.
'నేర్కొండ పార్వై' సినిమాకు యువన్ సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు నీరవ్ షా ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు.
- లైన్లో మరొకటి:
పింక్ రీమేక్ తర్వాత అజిత్‌తో మరో చిత్రం తీయనున్నట్లు బోనీ కపూర్ వెల్లడించారు.
' పింక్ రీమేక్‌ను ఈ ఏడాది మే 1న విడుదల చేయనున్నాం. తర్వాత చిత్రాన్ని జూలైలో ప్రారంభించి వచ్చే ఏడాది...ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం.
- నిర్మాత, బోనీ కపూర్.