Sridevei drama company latest episode: తమలో ఉన్న టాలెంట్‌ను చూపించి ఫేమ్ పొందాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో ఈటీవీ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఈ షోలో ఓ ఆరేళ్ల బాలుడు.. తన టాలెంట్‌తో అందర్నీ అబ్బురపరిచాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చెర్రీ అనే బాలుడు స్టేజ్‌పై డ్రమ్స్‌తో మ్యాజిక్ చేశాడు. మాస్, డీజే వెర్షన్లలో వావ్ అనిపించాడు. రెండేళ్ల వయస్సులోనే తాను డ్రమ్స్ నేర్చుకున్నానని.. తన తండ్రే నేర్పించాడని చెర్రీ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు, "ఊ అంటావా మావ ఊఊ అంటావా" పాటతో ఇటీవల ఓవర్ నైట్ ఫేమ్ సొంతం చేసుకున్న ఇంద్రావతి చౌహాన్.. లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఈ ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే!