ETV Bharat / sitara

సొట్టబుగ్గలతో బాలీవుడ్​ను మాయచేసిన దీపిక

author img

By

Published : Jan 5, 2021, 5:31 AM IST

ఆ చెక్కిళ్లలో ఏదో మాయ ఉంది. సొట్టలుపడే బుగ్గలతో ముసిముసిగా ఓ నవ్వు విసిరిందంటే చాలు.. బాక్సాఫీసులోని గల్లాపెట్టెలు నిండిపోతాయి. ఆ సినిమా కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దయిపోతుంది. షారుఖ్‌ఖాన్‌తో పాటు ముఫ్పై మందికి పైగా అగ్ర తారలు కనిపించిన 'ఓం శాంతి ఓమ్‌' సినిమాలో ఒక్కరి అందం మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోయిందంటే మాయ కాక మరేమిటి? ఆ మాయకు కేరాఫ్​ అడ్రస్​ బాలీవుడ్​ నటి దీపికా పదుకొణే. ఈ రోజు ఈ కన్నడ కస్తూరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని ఆసక్తికర విశేషాలు మీకోసం..

bollywood actress deepika padukone
బర్త్​డే స్పెషల్​:దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?

దక్షిణాది గడ్డపై పుట్టి పెరిగిన బాలీవుడ్​ నటి దీపికా పదుకొణే.. చిన్నప్పుడు రాకెట్‌ చేతపట్టి బ్యాడ్మింటన్‌ మైదానంలో మెరుపులు మెరిపించింది. పెద్దయ్యాక వెండితెరకు మారిపోయింది. అక్కడ మాత్రం అమ్మడి సందడి మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకెళ్లింది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' తో రూ.200 కోట్లు వసూళ్ల కథానాయికల క్లబ్‌లోకి చేరిపోయింది. ఆపై హాలీవుడ్‌కి కూడా వెళ్లి అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే ఓ ఇంటికి ఇల్లాలు కూడా అయ్యింది. బాలీవుడ్‌ నటుడు రణ్​వీర్‌సింగ్‌ను పెళ్లి చేసుకున్న ఈ కన్నడ భామ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ముద్దుముద్దుగా..

పూర్తి పేరు దీపికా పదుకొణే. ఇంట్లో మాత్రం ముద్దుగా అందరూ దీపి అని పిలుస్తుంటారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో 1986 జనవరి 5న పుట్టింది. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రకాష్‌ పదుకొణే. సొంత రాష్ట్రం కర్ణాటక. తల్లి పేరు ఉజ్వల. ఆమె ఓ ట్రావెల్‌ ఏజెంట్‌.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణే

బాల్యం..

బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో పాఠశాల విద్యని పూర్తి చేసింది దీపిక. చదువుకొనేటప్పుడే టీవీల్లో పలు ప్రకటనలు చేసింది. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ చిన్నప్పుడే రాకెట్‌ చేతపట్టింది. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా గుర్తింపును తెచ్చుకొంది. పదో తరగతి పరీక్షలు అయ్యాక మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. బెంగళూరులో మోడలింగ్‌కి సంబంధించిన ఓ కోర్సును కూడా చేసింది.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణే చిన్ననాటి ఫొటో

ర్యాంప్‌పై నడక
మోడలింగ్‌లోకి ప్రవేశించాక దీపికాకి పేరొచ్చింది. 2003లో బెంగళూరులోని ది వోగూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో మొదటి ర్యాంప్‌ వాక్‌ చేసింది. అక్కడ నుంచి ఆమె మెరుపులు మొదలయ్యాయి. పలు వ్యాపార ప్రకటనల్లో నటించింది. పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకొంది. ర్యాంప్‌పై నడవడం మొదలెట్టిన మూడేళ్లలోపే మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కింగ్‌ఫిషర్‌ ఫ్యాషన్‌ అవార్డును సొంతం చేసుకుంది. కింగ్‌ఫిషర్‌ స్విమ్‌సూట్‌ క్యాలెండర్‌పై కూడా మెరిసింది.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణే

సినీ ప్రవేశం..

వ్యాపార ప్రకటనల్లో మెరవడం మొదలవ్వగానే దీపికకు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. హిందీ నుంచి పలువురు దర్శకులు ఆమె వెంటపడ్డారు. అయితే ఈ సొట్టబుగ్గల సుందరి మాత్రం ఆ అవకాశాల్ని తిరస్కరిస్తూ వచ్చింది. కొన్నాళ్లకు హిమేష్‌ రేషమ్మియా చేసిన 'నామ్‌ హై తేరా' అనే ఓ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లో మెరిసింది. ఆ వీడియో దీపికాకి మరింత పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనుపమ్‌ ఖేర్‌ నట శిక్షణాలయంలోకి వెళ్లి నటన గురించి మెలకువలు తెలుసుకొంది. దీపిక తెర ప్రవేశం మాత్రం నాటకీయంగా జరిగిందని అంటుంటారు. ఆమె నటించిన తొలి చిత్రం 'ఐశ్వర్య'. కన్నడలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ఆదరణ పొందింది.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణే

షారుఖ్‌ సరసన..

అవకాశాలను వెదుక్కొనే అవసరమే రాలేదు, ఈ మెరుపుల రాకెట్‌కి. కన్నడ చిత్రం 'ఐశ్వర్య' విడుదలవ్వగానే హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. తొలి ప్రయత్నంలోనే షారుఖ్‌ ఖాన్‌ సరసన అవకాశాన్ని సంపాదించింది. 'హ్యాపీ న్యూ ఇయర్‌' పేరుతో తెరకెక్కాల్సిన ఆ చిత్రం ఉన్నట్టుండి వాయిదా పడింది. అంతలోనే ఫరాఖాన్‌ తన 'ఓం శాంతి ఓం' సినిమా కోసం దీపికని ఎంచుకొంది. రెండో ప్రయత్నంలో కూడా షారుఖ్‌ ఖాన్‌తోనే కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకొంది. ఇందులో శాంతిప్రియగా దీపికా పదుకొణే కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. 'షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతానని నేను కలలో కూడా అనుకోలేదు' అని చెబుతుంటుంది.

bollywood actress deepika padukone
షారుఖ్​ ఖాన్​తో దీపికా పదుకొణే

ఆ ముగ్గురూ..
అందరూ దీపికా గురించే మాట్లాడుకొంటారు. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ ముగ్గురి అందం గురించి ఆలోచిస్తుందట. శ్రీదేవి, మాధురి దీక్షిత్, అమితాబ్‌ బచ్చన్‌.. ఈ ముగ్గురూ తనకు ఇష్టమైన నటులు అంటోంది. వయసు పెరిగే కొద్దీ వీరి అందం పెరుగుతోందని చెబుతోంది. వీళ్లు ఎదురుగా వస్తే రెప్పలు వాల్చకుండా చూస్తుంటానంటోంది.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణేకు ఇష్టమైన నటులు

జాబితా పెద్దదే..
మోడలింగ్, సినిమాల రూపేణా దీపికా పదుకొణే ఎంత ప్రాచుర్యం పొందిందో.. తన స్నేహాలు, ప్రేమాయణాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. అనుపమ్‌ ఖేర్‌ దగ్గర నటన గురించి మెలకువలు నేర్చుకుంటున్నప్పుడే నిహార్‌ పాండ్య అనే యువకుడితో డేటింగ్‌ చేసిందని చెబుతుంటారు. ఆ తర్వాత ఉపేన్‌ పటేల్‌ పేరు వినిపించింది. సినిమాల్లో పేరు సంపాదించగానే తారలతో ప్రేమాయణం సాగించింది. రణ్‌బీర్‌ కపూర్‌ని కొన్నాళ్లపాటు గాఢంగా ప్రేమించింది. అతని పేరును కూడా ఒంటిపై రాయించుకొని మురిసిపోయింది. అయితే వీరి మధ్య బంధం ఎంతో కాలం సాగలేదు. ఆ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ, సిద్ధార్థ్‌ మాల్యా తదితరులతోనూ సన్నిహితంగా మెలిగింది. ఆ తరువాత రణ్‌వీర్‌ కపూర్‌తోనూ డేటింగ్‌ చేసింది. ఇప్పుడు అతనితోనే బంధం ముడిపడింది.

bollywood actress deepika padukone
దీపికా పదుకొణే

చేసిన చిత్రాలు... ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

'గోలియాన్‌ కి రాసలీల రామ్‌-లీల' 'కొచ్చాడయాన్‌', ఇంగ్లీషు చిత్రం 'ఫైడింగ్‌ ఫన్నీ', 'హ్యాపీ న్యూ ఇయర్‌', 'పీకూ', 'తమాషా', 'బాజీరావు మస్తానీ', హాలీవుడ్‌లో 'ట్రిపుల్‌ ఎక్స్‌:ది రిటర్న్‌ ఆఫ్‌ జేండర్‌ కేజ్‌', 'రాబ్తా', 'పద్మావత్‌', 'జీరో'. మేఘన గుల్జార్‌ దర్శకత్వంలో యాసిడ్‌ బాధితురాలి పాత్ర ఆధారంగా 'ఛపాక్‌'లో నటించింది. హృతిక్‌ రోషన్‌తో కలిసి 'ధూమ్‌4'లో చేయనుంది. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రంలో ప్రభాస్‌ సరసన కథానాయికగా నటిస్తోంది. హాలీవుడ్‌లో దీపికా కొన్ని చిత్రాల్లో నటించింది.

ఇష్టమైన చిత్రాలు

'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'ద కలర్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌', 'సిండ్రెల్లా మ్యాన్‌', 'మేరి పాపిన్స్‌' దీపికా పదుకొణే ఇష్టమైన చిత్రాలు.

నేను సాధారణమే!

"నేను పర్‌ఫెక్ట్‌ అనీ, నా జీవితం పరిపూర్ణమనీ చెప్పలేను. ఒత్తిడి, కష్టం, సులభం.. ఇలా అన్నీ నా జీవితంలో ఉన్నాయి. నా వృత్తి నా చిత్రాలు లార్జెర్‌ దేన్‌ లైఫ్‌లా ఉంటాయి కానీ.. నా జీవితం ఎప్పుడూ అలా ఉండదు" అని అంటోంది దీపికా పదుకొణే.

bollywood actress deepika padukone
'ఓం శాంతి ఓం' సినిమాలో దీపికా పదుకొణే

మరికొన్ని!

  • దీపికా పదుకొణేలో ఓ మంచి రచయిత ఉంది. ఓ ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ప్రచురించే లైఫ్‌ స్టైల్‌ సంచికకి 2009లో పలు వ్యాసాలు రాసింది.
  • తొలిసారి హిందీలో పలికిన సంభాషణ.. 'కుత్తే కమీనే! భగవాన్‌ కె లియే ముజే ఛోడ్‌ దే!'
  • మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొంది. విద్యుత్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని వసతులు సమకూర్చే ప్రయత్నం చేస్తోంది.
  • దక్షిణాది అమ్మాయి అయిన దీపికకి ఇక్కడి వంటకాలంటేనే బాగా ఇష్టం. ఉప్మా, దోశ లాంటివి ఇష్టంగా తింటుంది.
  • సంగీతం వినడం ఓ హాబీగా మారిందని చెబుతోంది దీపికా. మంచి ఆహారం తీసుకోవడం, బ్యాడ్మింటన్‌ ఆడటం, నిద్రపోవడం, దీపిక హాబీల జాబితా.

ఇదీ చూడండి:'అవునూ.. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.