ETV Bharat / sitara

'నాన్న... నావల్లే నష్టపోయాడన్నారు!' - Singer charan

ఎస్‌.పి.చరణ్‌... గానగంధ్వరుడి ఒడిలో పెరిగినా తాను మాత్రం గాయకుడు అవ్వాలనుకోలేదు. అనుకోకుండానే గాయకుడై 'అరె, అచ్చం వాళ్ల నాన్నగారిలాగే పాడుతున్నాడే!' అనిపించుకున్నాడు. నిర్మాతగా మంచి సినిమాలు తీసినా పేరు తప్ప డబ్బు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, కాస్త నిలదొక్కుకుంటూ ఉండగా తండ్రి హఠాన్మరణం! ఆ బాధ నుంచి కోలుకుంటూ.. 'పాడుతా తీయగా' కార్యక్రమంతో సరికొత్తగా సంగీతప్రియుల ముందుకు రాబోతున్న చరణ్‌ జీవితంలోని చీకటి వెలుగులు..

sp charan
చరణ్​
author img

By

Published : Aug 1, 2021, 2:56 PM IST

"కొడుకు వల్ల బాలూగారు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.... ఆయన్ను పూర్తిగా దివాలా తీయించాడు...' అనే విమర్శల నుంచి ‘సంగీతం రాకపోయినా వాళ్ల నాన్నలానే ఎంత బాగా పాడు తున్నాడు. మాటా.. పాటా.. అచ్చంగా వాళ్ల నాన్నదే...' అనే ప్రశంస వరకూ ఎన్నో చూశా. అన్నింటికీ చిరునవ్వునే సమాధానంగా మార్చుకున్నానంటే దానికి ఒకవిధంగా నాన్న ఇచ్చిన ధైర్యమే కారణం. నేను బాధపడినప్పుడల్లా 'నువ్వు కష్ట పడుతున్నావు కానీ అనుకున్నంత గుర్తింపు రావడంలేదు. అయితే ప్రతిదానికీ ఓ టైం వస్తుంది... ఆ రోజు కోసం ఎదురు చూడాలంతే...' అని చెప్పేవారు నాన్న. దురదృష్టమో, అదృష్టమో తెలియదు కానీ పాడుతా తీయగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం రావడం, స్వరాభిషేకంలో పాడటం... ఇవన్నీ ఆ టైంలో భాగమే అనుకుంటున్నా. ఇప్పుడు నాన్న ఉండుంటే ఎంత సంతోషించేవారో! ఎందుకంటే చిన్నప్పటినుంచీ నేను ఓ స్థాయికి వచ్చేవరకూ అమ్మానాన్నలు నా గురించి ఆలోచించని రోజు ఉండేది కాదు.

charan
ఎస్పీ చరణ్

నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. ఉమ్మడి కుటుంబం కావడం వల్ల మా ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది. నాన్న పాటలతో బిజీగా ఉంటే అమ్మ ఇంటి బాధ్యతలన్నింటినీ చూసుకుంటూనే నన్ను చదివించేందుకు ప్రయత్నించేది. కానీ నేను చదువు విషయంలో అమ్మను బాగా సతాయించడంతో రోజూ దెబ్బలు తప్పేవి కావు. మార్కులు సరిగ్గా రాక పోవడంవల్ల ఏ స్కూల్లోనూ ఎక్కువరోజులు ఉండనిచ్చేవారు కాదు. దాంతో చెన్నైలోని దాదాపు అన్ని స్కూళ్లలోనూ చదివేశా. విచిత్రం ఏంటంటే... నాన్నకు నేనేం క్లాస్‌లో ఉన్నానో కూడా తెలిసేది కాదు. ఇంటి కెవరైనా వచ్చి 'పిల్లలు ఏం చదువు తున్నారూ...' అని అడిగితే మమ్మల్ని పిలిచి 'ఏ క్లాస్‌ చదువుతున్నావు రా' అని వాళ్ల ముందే అడిగేవారు. ఎప్పుడైనా అమ్మ పిల్లల విషయంలో ఏం పట్టించుకోవడం లేదని నాన్నతో గొడవపడితే అప్పటికప్పుడు పాత క్వశ్చన్‌ పేపర్‌ను తెప్పించి ఏవేవో అడిగి 'సారి తక్కువ మార్కులు వస్తే ఊరుకోను... అమ్మను సతాయించకు... సరిగ్గా చదువు' అనేవారంతే. ఇలానే నానా తంటాలు పడి టెన్త్‌ పూర్తిచేశాక ఇక్కడ ఉంటే నేను చదవననుకున్నారో ఏమో తెలిసిన వారి సాయంతో అమెరికా పంపించేశారు.

charan
బాలుతో చరణ

రెండేళ్లు ఖాళీగా ఉన్నా...

అమెరికా వెళ్లాక ఇంటికి దూరంగా ఉండటం కష్టంగా అనిపించింది. నాన్న కచేరీల కోసమని ఎప్పుడైనా వచ్చినా, అమ్మను మాత్రం చాలా మిస్సయ్యేవాడిని. అక్కడే ఎనిమిదేళ్లు ఉన్న నేను బీబీఏతోపాటూ ఫిలిం-టెలివిజిన్‌కు సంబంధించిన కోర్సూ చేశా. నా చదువు పూర్తయ్యాక సినిమా రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాక ఓ ప్రొడక్షన్‌ కంపెనీ పెట్టాలనుకున్నా. ఎందుకంటే హాలీవుడ్‌లో అప్పుడప్పుడే గ్రాఫిక్స్‌ ప్రారంభమయ్యాయి. ఆ సాంకేతికతను ఇక్కడా పరిచయం చేయాలనుకున్నా. ఎలా చేయాలీ, ఏం చేయాలీ... అని ఆలోచిస్తున్న సమయంలో... ఓసారి డ్రైవరు రాకపోతే నాన్నను ప్రసాద్‌స్టూడియోస్‌లో దింపడానికి వెళ్లా. ఆ రోజు నాన్నా-ఇళయరాజా గారూ కలిసి 'పుణ్యవతి' అనే తమిళ్‌ సినిమాలో ఓ పాట పాడాలి. ఇళయరాజాగారు నన్ను చూసి 'పాట పాడతావా' అని అడిగారు. లేదని చెప్పినా 'ప్రయత్నించు' అంటూనే అప్పటికప్పుడు నా చేత కొన్ని లైన్లు పాడించారు. అది విడుదల కాలేదు కానీ... తరువాత ఆయనే కన్నడ సినిమాల్లో పాడించారు. దాంతో 'బాలూ గారి అబ్బాయి పాడుతున్నాడట' అనే ప్రచారం మొదలయ్యింది. అలా పాటల అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. వాటిల్లో కొన్ని హిట్టయ్యాయి కూడా. దాంతో పాటలు పాడాలా లేక నేను అనుకున్నట్లుగానే నిర్మాణ సంస్థను పెట్టాలా అనే సందిగ్ధతతో రెండేళ్లు గడిచిపోయాయి. నాన్నను సలహా అడిగితే సంగీతం నేర్చుకోమన్నారు. అప్పుడు నేను సంగీతం నేర్చుకుని ఉంటే మరో సింగర్‌ని అయ్యేవాడినేమో కానీ నా జీవితం మరోలా మలుపు తిరిగింది.

బాగా నష్టపోయాం...

ఇప్పుడు సముద్రఖని నటుడిగా స్థిరపడినా... ఒకప్పుడు అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఉండేవాడు. నాకు అతను పరిచయం అవ్వడంతో ఇద్దరం తరచూ సినిమా కథల గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా అతను రాసిన ఓ కథ నాకు బాగా నచ్చడంతో దాన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లా. ఆయనా బాగుందని చెప్పడంతో మా నిర్మాణ సంస్థ 'క్యాపిటల్‌ ఫిలిం వర్క్స్‌' ఆధ్వర్యంలో నేనే నిర్మాతగా 'ఉన్నై శరణడైందేవ్‌' సినిమా తీశా. దానికి రాష్ట్ర అవార్డులు వచ్చాయి కానీ లాభాలు పెద్దగా రాలేదు. ఆ తరువాత తెలుగులో వచ్చిన 'వర్షం'లో 'మెల్లగా కరగనీ..' పాట పాడే అవకాశం వచ్చింది. ఆ సినిమా నాకు బాగా నచ్చడంతో దాన్ని తమిళంలో తీయాలనుకున్నా. అదే విషయం నాన్నకు చెప్పి ఆ సినిమా రైట్స్‌ని కొనేశా. ఆ రోజుల్లోనే సినిమా కోసం డైబ్బైఅయిదు లక్షల రూపాయలు పెట్టాం. సినిమా పూర్తయ్యేకొద్దీ... బొమ్మ బాగా వస్తోంది, ఇంకాస్త డబ్బు పెట్టినా లాభాలు వస్తాయని కొందరు చెప్పడంతో ముందువెనకలు ఆలోచించకుండా ఖర్చుపెట్టా. అలా పెట్టిన డబ్బు పూర్తిగా పోయి నష్టాలు వచ్చాయి. దాంతో దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉండిపోయా. ఆ సమయంలో నేనూ, వెంకట్‌ప్రభు అనే నటుడు, మరికొందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు రోడ్డుమీద క్రికెట్‌ ఆడే పిల్లల గురించి ఓ కథ తీయాలనే చర్చ మొదలైంది. నాన్నకు చెబితే ‘మళ్లీ సినిమా ఎందుకురా’ అన్నారు. ఈసారి నాకున్న పాత అనుభవాలతో చిన్న బడ్జెట్‌తోనే చెన్నై600028 తీశాం. అది హిట్టయ్యింది కానీ లాభాలు ఆశించినంత రాలేదు. అదయ్యాక 'అరణ్యకాండం' తీశా. ఆ సినిమాకు మూడు జాతీయ అవార్డులూ, న్యూయార్క్‌ ఏషియన్‌ ఫిలింఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డూ వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పేరు వచ్చింది కానీ పైసలే రాలేదు. ఆ పరిస్థితులూ యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని సంఘటనలూ నన్ను మానసికంగా కుంగదీశాయి. అప్పటికే రెహమాన్‌, దేవిశ్రీప్రసాద్‌, హారిస్‌ జైరాజ్‌... వంటి సంగీత దర్శకులు తమ ఇళ్లల్లోనే స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతో పెద్ద స్టూడియోలకు పని లేకుండా పోయింది. వాటిలో నాన్న కట్టిన కోదండపాణి స్టూడియోస్‌ కూడా ఒకటి. ఆ సమయంలో స్టూడియో బాధ్యతల్ని నేను చూస్తుండటం, దాన్నుంచి పెద్దగా ఆదాయం రాకపోవడంతో నాన్నా, నేనూ చర్చించుకుని ఆ స్టూడియోలో పనిచేసే కొందరికి మరోచోట ఉద్యోగం కల్పించాం. కొన్ని పరికరాలను జెమినీ వాళ్లకు ఇచ్చాం. ఓ వైపు నా సినిమాకు లాభాలు రాకపోవడం, స్టూడియోలో మార్పులు చేయడం చూసిన పత్రికలు... ‘‘బాలూగారు ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానికి కారణం వాళ్ల అబ్బాయే’ అని రాశాయి!

charan
బాలు కుంటుంబం

కోలుకుంటూ ఉండగానే ఇలా!

పత్రికలు అలా రాయడం చూసి నేనేదో నేరం చేసినట్లనిపించి అపరాధభావానికి లోనయ్యాను. అమ్మానాన్నా మాత్రం 'నిజం ఏంటనేది మనకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడ్డావనేది నీ మనస్సాక్షికి తెలుసు. ఎవరేం అన్నా పట్టించుకోకు!' అని నాలో ధైర్యాన్ని నింపారు. ఈసారి స్టేజిషోలు ఆ బాధ నుంచి నన్ను బయటపడేశాయి. తరువాత మరికొన్ని సినిమాలు తీసినా... నాన్న ద్వారా వచ్చిన సంగీతమే నన్ను కోలుకునేలా చేసింది. పాటలే కొనసాగించాలా లేక మళ్లీ కొత్త సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాలా.. లేక రెండింటినీ చూసుకోవాలా... అని ఆలోచిస్తున్న సమయంలో కరోనాతో నాన్న పోవడంతో నా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. బయట నాన్న అభిమానులకీ, స్నేహితులకీ ధైర్యం చెబుతున్నా... లోలోపల నేను ఏడుస్తూనే ఉండిపోయాను. ఆ బాధ నుంచి నన్ను బయటపడేయడానికా అన్నట్టు ‘పాడుతా తీయగా’ నాన్నలా నన్ను పలకరించింది. యాంకరింగ్‌ చేయమంటూ భుజం తట్టింది. నాన్న దాదాపు పాతిక సంవత్సరాలపాటు నిర్వహించిన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయడం అంటే మాటలు కాదు! ప్రారంభంలో నాన్న కూడా ఇంత బృహత్కార్యం తన వల్ల అవుతుందా... అని చాలా కంగారుపడ్డారు. తన స్వీయ అనుభవాలతో పాటు ఒక్కోపాట గురించీ తాను విన్నవీ కన్నవీ అన్నీ ఆ కార్యక్రమానికి వచ్చే పిల్లలకు చెప్పేవారు. తర్వాత్తర్వాత అందులో మాస్టర్‌ అయిపోయారు. ఇప్పుడు నన్ను యాంకరింగ్‌ చేయమన్నప్పటి నుంచీ ఆ ఎపిసోడ్లన్నీ మరోసారి చూస్తున్నా. వాటి నుంచి ఎంతో నేర్చుకుంటున్నా. నన్నూ నాన్ననూ పోలుస్తారేమో అన్న సందేహం లోలోపల వెంటాడుతున్నా... పైనుంచి నాన్నగారూ, ఇక్కడ ఆయన ఆత్మీయులైన మీరందరూ తప్పక ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ధైర్యంగానే బరిలోకి దిగుతున్నాను.

నాన్న పొగిడేవారు కాదు

చాలామంది నా పాటలు విని అచ్చం నాన్నగారిలా పాడుతున్నావని అనేవారు. ఒకప్పుడైతే... నాకంటూ ఓ స్టైల్‌ఉండాలని తపన పడేవాడిని కానీ ఇప్పుడు ఆ మాటల్ని ఓ ఆశీర్వచనంలా తీసుకుంటున్నా. పాడుతా తీయగాలో పిల్లలు పాడుతున్నప్పుడు ఎలా ఆలోచిస్తారో... నా పాటల్లోనూ అలానే తప్పొప్పులు వెతికేవారు నాన్న. పాటలో పదాల ఉచ్చరణ నుంచి భావం పలికే తీరుదాకా ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలన్న ఆయన పట్టుదల చూసినప్పుడు కాస్త చికాకుగా అనిపించేది తప్పితే మిగిలిన విషయాల్లో నాన్నా నేనూ ఫ్రెండ్సే. తీరిక దొరికినప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. పేకాటా ఆడుకునేవాళ్లం. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో నాన్నకు వీడియోలు తీయడం, ఫేస్‌బుక్‌ లైవ్‌లు పెట్టడం, యూట్యూబ్‌ వీడియోలు చేయడం... వంటివన్నీ నేనే నేర్పించా. మేమిద్దరం కలిసి ప్రోగ్రాంలూ చేసేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా... నేను కూడా నాన్న పాటలు పాడేవాడిని కానీ... ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకరాభరణం, పుణ్యభూమి నాదేశం.. వంటి పాటల్ని మాత్రం పొరపాటున కూడా పాడేవాడిని కాదు. వాటిని నాన్ననోటే వినాలని అభిమానులు కోరుకునేవారు. ఆయనకున్న కోట్లాది అభిమానుల్లాగే నేనూ నాన్నకూ, ఆయన పాటలకూ చాలా పెద్ద ఫ్యాన్‌ని.

అక్కతో అన్నీ పంచుకుంటా...

అక్క పల్లవి... మొదటినుంచీ బాగా చదివేది. ఇంటికొచ్చాక తనేమో చకచకా చదువుకుని ఆటలకు వెళ్తూ... నేను ఇంకా హోంవర్క్‌ చేయలేదని అమ్మతో చెప్పేది. దాంతో అమ్మ చదువుకుంటేనే గానీ ఆటలకు వెళ్లకూడదనేది. అక్క ఆడుకుంటూనే అక్కడి నుంచి నన్ను వెక్కిరించేది. చిన్నప్పుడు మేమిద్దరం అలా టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్నా పెద్దయ్యాక మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. నేను అమెరికా వెళ్లిన రెండేళ్లకు తను కూడా వచ్చింది. తన కాలేజీ పొద్దుటిపూట కావడంతో పొద్దున్నే అక్కను కారులో కాలేజీలో దింపి, మధ్యాహ్నం తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు అమ్మకు చెప్పలేని విషయాలను తనతోనే చెప్పుకుంటా... నా బెస్ట్‌ఫ్రెండ్‌ తనే.

అమ్మ లేకపోతే నేను లేను...

అమ్మ సావిత్రి... తనని చూసినప్పుడు ఎంత సహనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిందోనని అనిపిస్తుంటుంది. నేను సరిగ్గా చదువుకోవడంలేదని ఎప్పుడూ బాధపడేది. ఓసారి ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌ అమ్మతో ‘మీ సినిమావాళ్లు జీవితాల్ని ఎంజాయ్‌ చేస్తారు. పిల్లల్ని అన్నిచోట్లకూ తీసుకెళ్తారు తప్ప వాళ్లను చదివించరు... పట్టించుకోర’ని అన్నారట. నాకోసం తను అలాంటి మాటల్ని ఎన్ని పడి ఉంటుందోనని ఇప్పుడు అనిపిస్తుంటుంది. నా విషయంలో నాన్నతో ఎన్నోసార్లు గొడవపడేది. ఎప్పుడూ నన్నే సపోర్టు చేసేది. ఒకవిధంగా నన్ను ఒంటిచేత్తో తీర్చిదిద్దింది. ఇప్పటికీ మా మధ్య వాదనల్లాంటివి జరిగినా నేను మాత్రం అమ్మకూచీనే. నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే దానికి కారణం అమ్మే.

ఇదీ చూడండి:- SP Balu: బ్రహ్మ, మురారీ.. బాలు 'స్వరార్చితం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.