ETV Bharat / sitara

అమరం... అఖిలం.. నీ గానం! - ఎస్పీ బాలు పాటలు

గుండె బరువెక్కే నిజం.. బాలూ లేడని! గుండెను తేలిక పరిచే ఊరట.. బాలూ పాట మనతోనే ఉందని! అర్థశతాబ్దంపైగా పాటల పూదోటలో.. రాగాల తీగలతో... గానాల ఊయలలూగించిన ఆ పాటదారి.. తన పాత్రను ముగించి.. నాదలోకానికి వెళ్లిపోయాడు.. బాలు భౌతికంగా లేరన్నది ఎంత నిజమో.. తన సుమధుర గళంతో ఈ లోకాన్ని వ్యాపించారన్నదీ అంతే నిజం! మరణం.. ఆయన దేహానికి కానీ.. అజరామరమైన ఆ గొంతుకు కాదు కదా! ఒక్కసారి ఆ గొంతులో నుంచి వచ్చిన గీతాలను గుర్తుచేసుకుందాం..

sp balu special story about his songs in tollywood
ఎస్పీ బాలు
author img

By

Published : Sep 25, 2020, 9:20 PM IST

రేపటి నుంచి బాలూ పాటను వినని రోజు మనకుంటుందా.. గుండె గుండెనూ తడిమిన ఆ గొంతును మర్చిపోగలమా.. ఆ పాటలన్నీ ఓ సారి తిరిగి చూసుకుంటే.. 50 ఏళ్లకు పైగా.. ప్రతి ఇంటినీ.. ఏదో రూపంలో రంజింప జేస్తున్న ఆ గొంతు. తొలిసారిగా పరిమళించింది.. 1964లో ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలో బాలూకు ప్రథమ బహుమతి వరించింది. ఆనాడు ఓ పాటల పోటీకి న్యాయనిర్ణేతలుగా వచ్చిన సంగీత దిగ్గజాలు సుసర్ల దక్షిణామూర్తి, ఎస్పీ కోదండపాణి, గంధర్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. వీరు ముగ్గురూ అతడి గాత్రమాధుర్యాన్ని, సొగసైన స్వరాల విరుపులను, మెరుపులను గుర్తించారు.

sp balu special story about his songs in tollywood
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

1966 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' తో కోసం 'ఏమి ఈ వింత మోహం' అనే పాటతో కోదండపాణి బాలును సినీలోకానికి పరిచయం చేశారు. 1969లో మహదేవన్ స్వరకల్పనలో ఏకవీర సినిమాలో మాస్టారు.. ఘంటసాలతో కలసి వసంతరాత్రిని కురిపించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చెల్లెలికాపురం సినిమాలో 'ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ' అనే పాటతో బాలూ చెలరేగిపోయారు. 1972లో పలకరించిన గూడుపుఠాణిలో 'తనివి తీరలేదే..' అంటూ కథానాయకుడు కృష్ణకు ఆలపించిన ఆ గీతాన్ని ఇప్పటికీ తనివతీరకుండా వింటున్నారు.. ఇక 'కన్నెవయసు' చిత్రంలో 'దివిలో విరిసిన పారిజాతాన్ని' నేలపైకి దించారు.

ఇదంతా ఆయన పాటల్లో తొలిదశ.. 1974 తర్వాత ఆయన గేర్ మార్చారు. బాలు సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు. అయినా బాలుకు రాగ, తాళ జ్ఞానపం, సంగీత పరిజ్ఞానం పుష్కలం. ఒక్కసారి వింటే అదేవిధంగా పాడగలిగే ఏకసంధాగ్రాహి. గళానికీ అభినయం ఉంటుందని, ఉందని, నిరూపించిన సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సంగీత దర్శకులు స్వర జ్ఞానులైతే బాలసుబ్రహ్మణ్యం గళ విన్యాస జ్ఞాని. పెద్ద హీరోల పాటలకు అది ధన్యనుసరణ చేశారు.. అక్కడి నుంచి బాలుకు తిరుగులేదు. హీరోలు అందరినీ ఆవాహన చేసి ఆలపించడం మొదలుపెట్టారు. 1977లో ఎన్టీరామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం అడవిరాముడు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్​కు తగినట్లుగా బాలు తన గొంతు మార్చుకున్నారు. 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు' పాట అఖండ విజయం సాధించింది. వేటూరి కలం, బాలూ గళం, మహదేవన్ స్వరం ప్రేక్షకులపై 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట సూపర్ హిట్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1977లోనే ప్రేక్షకులను అలరించిన దానవీర శూరకర్ణలో దుర్యోధనుడికి ఎన్టీఆర్ యుగళగీతం పెట్టారు. సినారె రాసిన ఆ పాట చిత్రంగా, భళారేవిచిత్రంగా, గమ్మత్తుగా అన్పించింది. 'ఆకుచాటు పిందె తడిచె' అంటున్నా.. 'జననీ జన్మభూమిశ్చ' అని దేశభక్తిని ప్రబోధించినా.. మళ్లీ చాన్నాళ్లకు 'పుణ్యభూమి నాదేశం నమో:నమామీ' అంటూ.. అదే రీతిలో ఆలపించినా.. ఎక్కడా బాలు కనిపించలేదు. ఎన్టీఆరే పాడుతున్నట్లు కనిపించింది. ఓ పక్క ఎన్టీఆర్ లాగా అదరగొడుతూ.. మరోవైపు ఏఎన్నార్​ను దించేశారు. వాళ్ల కాంబినేషన్​లో ప్రేమాభిషేకం ఎవర్ గ్రీన్ ఆల్బమ్ 'ఆగదూ..ఆగదూ', 'వందనం అభివందనం', 'కోటప్ప కొండకు వస్తానని' ఇలా అన్నీ ఆల్​టైమ్ హిట్సే!

సూపర్​స్టార్​కు ఇచ్చిన పాటలు మరో వైవిధ్యం. 'నేనొక ప్రేమ పిపాసినీ..' అంటూ ఇంధ్ర ధనస్సులో 'నవ్వుతూ బతకాలిరా' అంటూ.. మాయదారి మల్లిగాడులో బాలు చూపించిన వేరియేషన్స్.... ఎవ్వరి వల్లా కానివి! కృష్ణ గొంతులోని చిన్న పాటి సౌండ్​ను.. మాడ్యులేషన్​ను కూడా యథాతథంగా పలికించారు.

వారి తర్వాత వచ్చిన తర్వాత తరంలో పాటంటే బాలు... బాలు అంటే పాట.. అంతే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. హీరోలు, డైరక్టర్లు.. నిర్మాతలు.. మారతారు.. సింగర్ పేరు మాత్రం సింగిల్ కార్డే! అదీ ఎస్పీ బాలసుబ్రమణ్యం.. అని.! ఈ హీరోలతో.. వీళ్ల గొంతులతో ఆయన ఓ ఆట ఆడేశారు.. జనాలను తన పాటల మత్తులో ముంచేశారు. ఈ నలుగురు స్టార్ హీరోలకు కొద్దిపాటి వేరియేషన్ ఇచ్చి.. బాలు చూపించిన మ్యాజిక్ మామూలుది కాదు. అసలు సినిమా పేరు తెలియకపోయినా సరే.. బాలూ పాట విని అదే హీరోదో చెప్పగలిగేంత పరిస్థితి ఉండేది. 'బంతీ చేమంతి' అంటూ అభిలాషలో, 'ఇందువదన కుందరదన' అంటూ ఛాలెంజ్​లో హుషారు నింపారు. 'తరలిరాద తనే వసంతం', 'శుభలేఖ రాసుకున్నా' , 'మల్లి మల్లి ఇది రానీ రోజు' (రాక్షసుడు ) 'చిలుకా క్షేమమా' (రౌడీ అల్లుడు ) ఈ పాటలన్నీ అదరహో అనిపించాయి. చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్ తీస్తే.. 90శాతం బాలూ పాటలే ఉంటాయి.

'దంచవే మేనత్త కూతురా' ( మంగమ్మగారి మనవడు), 'రాళ్లల్లో ఇసుకల్లో..' ( సీతారామకల్యాణం) 'జాణవులే వరవీణవులే' ( ఆదిత్య 369) 'జగదానంద కారకా'( శ్రీరామరాజ్యం) అంటూ బాలయ్యకు.. అద్భుతమైన హిట్స్ ఇచ్చారు.

నాగార్జునకు పాడిన పాటలైతే.. హీరోకే కాదు.. బాలసుబ్రమణ్యంకు కూడా ఆల్ టైమ్ హిట్స్. నాగార్జున వాయిస్ అంత బాగా నప్పేది ఆయన పాటలకు. గీతాంజలి, శివ, నిర్ణయం, హలో బ్రదర్ లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలతో ఆధ్యాత్మిక గీతాలను నాగార్జునకు అందించారు. 'ఆమనీ పాడవే'.. 'ఓ పాపా లాలీ', 'హలో గురు ప్రేమ కోసమే', 'ప్రియరాగాలే', 'నీ నవ్వు చెప్పింది నాకు', 'శ్రీవారు దొరగారు', 'స్వప్నవేణువేదో'... లాంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అన్నమయ్య అన్నీ పాటలూ ఆయన ఆలపించినవే.. 'అమరం.. అఖిలం.. మన ప్రేమ' అంటూ ఆయన వెంకటేశ్​కు ఇచ్చిన పాటతో కుర్రకారు హుషారెత్తింది. 'బలపం పట్టి భామ ఒళ్లో', పొద్దున్నే పుట్టింది చందమామ అంటూ... 'జామురాతిరి జాబిలమ్మ'ను కూడా పిలిచారు. సుందరకాండ, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, రాజా. ఇలా ఒకటా రెండా అన్నింటిలో అద్బుతమైన గీతాలే.

ఓ పక్క వీళ్లకు పాడుతూనే తమిళం నుంచి డబ్బింగ్ అయి వచ్చిన సినిమాల్లో ఊపు ఊపారు. 'భలే భలే మగాడివోయ్' అంటూ 'సాపాటు ఏటూ లేదు పాటైన పాడు బ్రదర్' అంటూ కమల్​కు ఊపుతెచ్చారు. 'కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు' అంటూ ఆ రోజుల్లో బాలూ చేసిన అల్లరికి కుర్రకారు నిజంగానే వెర్రెక్కిపోయారు.

విశ్వనాథ్ చిత్రాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం ప్రపంచమంతా పరిచయమైంది. లలితకళారాధనకు జాతి తనను తాను శృతి చేసుకోవటానికి, దూరమవుతున్న సాంస్కృతిక విలువలు, మృగ్యమైన మానవ సంబంధాలను తిరిగి అద్దాలన్న తపనతో సంగీత, నాట్య ప్రధాన చిత్రాలకు శంకరాభరణంతో శ్రీకారం చుట్టారు. వాటిలో 'శంకరా నాదశరీరాపరా', 'దొరకునా ఇటువంటి సేవ' గీతాలు కకలకాలం గుర్తుండిపోతాయి. 1983లో వెండితెరకెక్కిన దశ్యకావ్యం సాగరసంగమం. బాలు గానం చేసిన 'వేదం అణువణువున నాదం', 'మౌనమేలనోయి' పాటలు కలిసి ప్రేక్షకులను గుమ్మెత్తించాయి. 1985లో ప్రేక్షకులను పలకరించిన స్వాతిముత్యం లో అణువు అణువు ప్రణయ మధువు గీతాన్ని బాలు జానకమ్మ యుగళంలో మంత్రముగ్ధుల్ని చేసింది. 'సువ్వి..సువ్వీ సువ్వాలమ్మ' కలకాలం గుర్తుండే పాట.

'విధాత తలపున సత్‌సంకల్పం ప్రభవించి' బాలు గళాన్ని భరతజాతికి కానుకగా రాసిచ్చారు కావచ్చు. 'ఈగాలీ, ఈ నేలా, సెలయూరూ'..అంటూ సెలయేటి పాటయ్యారు. నేపథ్యగాన ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు... అందుకే ఆయన విశ్వమంతా బాలుపాటలే వినపడుతున్నాయి. 1987 ఆత్మగౌరవం, స్వయంకృషితో ఎలా ఎదగవచ్చో చాటిన చిత్రం.. స్వయంకృషిలో రమేశ్ నాయుడు స్వరాల్లో బాలు గళం హుషారుగా పరుగెత్తింది. స్వాతి కిరణం.. శుభసంకల్పం లోనూ.. అదే కొనసాగింది. . 50 ఏళ్లుగా పాడుతున్నా.. ఆ గళంలో ఫ్రెష్​నెస్ గ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ గొంతు అప్పట్లో ఎలా ఉందో.. ఇప్పుడూ ... అంతే..! ఈ మధ్య మీరు శర్వానంద్ కు పాడిన "నిలువదే మరి నిలువదే " పాటను విన్నా.... పలాస సినిమాలో కొత్తబ్బాయి కరుణాకర్ కు పాడిన సొగసరి పాట చూసినా.. కొన్ని నెలల కిందటే వచ్చిన డిస్కో రాజాలో .. "నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో" పాట విన్నా... 80లలో బాలూకి.. ఇప్పటి బాలూకి ఏం తేడా లేదు. సేమ్ టూ సేమ్. అందుకే బాలూ అంటే బాలూనే .. ఎవర్ గ్రీన్.

పాటలు పాడటమే కాదు.. పాటకు పట్టాభిషేకం నిర్వహించే పాడుతా తీయగాకు ఆద్యుడు బాలు. తాను పాడిన పాటలనే కాదు.. 80ఏళ్లుగా తెలుగు సినీ జగత్తులో వచ్చిన అద్భుతమైన పాటలను పరిచయం చేస్తోంది ఆ వేదిక. పాతికేళ్లుగా అప్రతిహతంగా కొనసాగింది. స్వరాభిషేకంలో మంత్రపుష్పాలలా జ్ఞాపకాల చర్చ చందన చర్చితమవుతుంటే అందరూ మంత్రముగ్ధులై ఆస్వాదిస్తుంటారు. అతడి మాటలకు ఎదలోతుల్లో జ్ఞాపకాలన్నీ పొరలు చీల్చుకుని కన్నీటి తెరలుగా ఉబికి ఉబికి వస్తాయి. సినీబంధువులంతా ఆ జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల కాసారంలోకి తొంగి చూసుకుని తమను తాము గుర్తించుకుంటారు. కలకాలం గుర్తుంచుకుంటారు.

సంగీత వాద్య బృందంలో ఏఏ కళాకారుడు ఏఏ పరికరంతో సహకరిస్తున్నాడో జ్ఞాపకం ఉంచుకుంటారు. సంగీత,సాహిత్య సమలంకృతం. అంతరంగాలలోని మధుర స్మృతుల ఆవిష్కరణకు అవార్డులు ఇస్తే ప్రథమ పురస్కారం ఆయనకే దక్కుతుంది. బాల సుబ్రహ్మణ్యం మెదడు పెద్ద మెమొరీ కార్డు. వేలవేల గిగాబైట్ల జ్ఞాన భాండాగారం. అతడితో సంభాషించడం అంటే తెలుగు సినిమా కనీస ఐదున్నర దశాబ్దాలు తన జ్ఞాపకాలను, వ్యాపకాలను నెమరువేసుకోవటం.

ఇప్పుడు బాలూ లేరు.. కానీ ఆయన పాట.. ప్రతీనోటా.. ఇలాగే కలకాలం పాడుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.