సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలిన్ మృతితో తనకు సంబంధం ఉందన్న వార్తలను ఖండించాడు నటుడు సూరజ్ పంచోలీ. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు గర్భిణి అని.. సూరజ్ వల్లే దిశ గర్భం దాల్చిందని ప్రచారం జరుగుతోంది. దిశను అబార్షన్ చేయించుకోవాలని సూరజ్ సూచించగా.. అందుకు ఇష్టంలేని ఆమె తనువు చాలించిందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సుశాంత్.. తన మేనేజర్‌కు మద్దతు తెలిపాడని తెలుస్తోంది. దిశ మరణించినప్పుడు సూరజ్ ఆమె ఫ్లాట్‌లో ఉన్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ రూమర్లపై తాజాగా స్పందించాడు సూరజ్ పంచోలీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"దిశ ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో ఒక్కసారైనా ఆమెను కలవలేదు. సుశాంత్ మరణం తర్వాత ఆమె గురించి తెలుసుకున్నా. ఈ విషయాల్లో కుటుంబాలను కలపడం కొంచెం బాధగా అనిపించింది. కొంతమంది దీనికి సంబంధించిన విషయాలను సోషల్‌మీడియాలో సినిమా స్క్రిప్ట్లా పోస్టు చేస్తున్నారు. సుశాంత్‌ను నా సోదరుడిలా భావించా. మేమిద్దరం ఎప్పుడు కలిసినా సినిమాల గురించి నా ఫిట్నెస్ ట్రైనింగ్ గురించి చర్చించేవాళ్లం. 2017లో మా ఇద్దరి మధ్య జరిగిన కొన్ని పరిణామాల గురించి వార్తలు వచ్చినప్పుడు.. సుశాంత్ స్పందించాడు. ఇలాంటి వార్తల వల్ల సల్మాన్ తనపై కోపంగా ఉన్నట్లు తెలిపాడు. దీనిపై స్పష్టత ఇవ్వమని నన్ను అడిగాడు. 'బాంద్రాలో ఓ ఫంక్షన్లో విందు కోసం కలుసుకున్నాం. అందులో సరదాగా గొడవపడుతున్నట్లు ఉన్న చిత్రాన్ని షేర్ చేశాం అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు' అని తెలియజేశా. సుశాంత్ నాకు బెస్ట్‌ఫ్రెండ్ మాత్రమే".
- సూరజ్ పంచోలీ, బాలీవుడ్ నటుడు
"సుశాంత్, దిశ ఆత్మహత్య కేసుల్లో మీ ప్రమేయం ఉందా?" అడిగినప్పుడు.."సుశాంత్ లేడనే వార్త వింటుంటే చాలా బాధగా ఉంది. దీనిపై రకరకాలుగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. కొన్ని రోజులు వైరల్ అవుతాయి. కానీ, వాటన్నింటి కంటే ముందు నిజాన్ని తెలుసుకోండి" అని వెల్లడించాడు సూరజ్.
ఇదీ చూడండి... హిట్ కాంబినేషన్లు మళ్లీ రాబోతున్నాయి