ETV Bharat / sitara

రచయితగా మారిన విలన్​- వలసకూలీలపై పుస్తకం - సోనూసూద్​ పుస్తకం రాస్తున్నాడు

లాక్​డౌన్​లో వేల మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేరవేశారు ప్రముఖ నటుడు సోనూసూద్​. ఇదంతా ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు​. ఈ అనుభూతికి అక్షర రూపాన్ని ఇచ్చి ఓ పుస్తకం రాయనున్నట్లు తెలిపారు.

sonu sudh
సోనూసూద్
author img

By

Published : Jul 15, 2020, 9:55 AM IST

Updated : Jul 15, 2020, 10:29 AM IST

ప్రముఖ సినీనటుడు సోనూసూద్.. రచయితగా కొత్త అవతారం ఎత్తనున్నారు. 'లైఫ్​ ఛేంజింగ్​' అనే పుస్తకాన్ని రాయనున్నట్లు తెలిపారు. పెంగ్విన్​ ర్యాండమ్​ హౌస్​ ఇండియా.. ఈ పుస్తకాన్ని ప్రచురించనుందని వెల్లడించారు.

కరోనా కారణంగా లాక్​డౌన్​లో ఇరుక్కుపోయిన ఎంతో మంది వలస కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా తమ స్వస్థలాలకు చేరవేశారు సోనూ. అయితే ఈ ప్రయాణంలో వారితో ఏర్పడిన బంధం ఓ అందమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. ఎన్నో అనుభవాలను నేర్పిందని వెల్లడించారు. వీటన్నింటికీ అక్షర రూపాన్నిచ్చి 'లైఫ్​ ఛేంజింగ్' పేరుతో పుస్తకాన్ని రాయనున్నట్లు తెలిపారు.

"గత మూడున్నర నెలలుగా వలస కార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడుపుతూ, వారి బాధలను పంచుకుంటున్నాను. ఈ క్రమంలో నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. వారిని తమ స్వస్థలాలకు చేరుస్తుండటం నా మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారి ముఖాల మీద నవ్వు, ఆనందబాష్పాలు నా జీవితంలోనే ఓ ప్రత్యేకమైన అనుభూతి. అయితే ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలన్నింటినీ ఓ పుస్తకంగా రాస్తున్నాను. చిట్టచివరి వలస కూలీ తన స్వగ్రామానికి చేరే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. "

-సోనూసూద్​, ప్రముఖ నటుడు.

ఇప్పటికే వేలాది మంది కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వరాష్ట్రాలకు తరలించారు సోనూసూద్​. గత నెలలో ఏకంగా ఓ విమానం ద్వారా 300 మంది కూలీలను వారి ఇళ్లకు చేర్చారు. దీంతోపాటు పంజాబ్​లోని ఓ వైద్యబృందానికి పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చారు.

sonu sudh
సోనూసూద్

ఇది చూడండి : 400 పేద కుటుంబాలకు అండగా సోనూసూద్

Last Updated : Jul 15, 2020, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.