ETV Bharat / sitara

Sonu Sood Supermarket: పది కోడిగుడ్లు కొంటే బ్రెడ్​ ప్యాకెట్​ ఫ్రీ! - సోనూసూద్​ వార్తలు

నటుడు సోనూసూద్​(Sonu Sood).. చిరు వ్యాపారాలకు తన మద్దతు తెలిపారు. సైకిల్​పై తినుబండారాలు అమ్ముతూ.. చిన్న చిన్న వ్యాపారాలకు(Small Businesses) ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Sonu Sood Starts 'Sonu Ki Supermarket'
Sonu Sood Supermarket: పది కోడిగుడ్లు కొంటే బ్రెడ్​ ప్యాకెట్​ ఫ్రీ!
author img

By

Published : Jun 24, 2021, 3:56 PM IST

Updated : Jun 24, 2021, 6:47 PM IST

చిరు వ్యాపారాలకు తన మద్దతు తెలియజేసేందుకు నటుడు సోనూసూద్​(Sonu Sood) విన్నూత్న ప్రయత్నం చేశారు. ఓ సైకిల్​పై గుడ్లు, బ్రెడ్​తో పాటు మరికొన్ని తినుబండారాలను అమ్ముతూ చిరు వ్యాపారులకు తన మద్దతు తెలిపారు. ఆ సైకిల్​కు 'సోనూ కి సూపర్​మార్కెట్​' (Sonu Sood Supermarket) అని నామకరణం చేసిన సోనూసూద్​.. దానికి గురించి ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

"మాల్స్​ మూసివేశారని ఎవరు చెప్పారు? అతి ముఖ్యమైన, విలువైన సూపర్​మార్కెట్​ ఇప్పుడు మీ ముందే ఉంది. మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న కోడిగుడ్లు.. ఒక్కొక్కటి రూ.6. బ్రెడ్​ ప్యాకెట్లలో పెద్దది రూ.40.. చిన్నవి రూ.22. వీటితో పాటు నా దగ్గర పావ్​, రస్క్​, మరమరాలు, చిప్స్​ వంటివి ఉన్నాయి. ఎవరికి ఏమి కావాలో వచ్చి తీసుకోండి. సరైన టైమ్​లో డెలివరీ చేయడం సహా డెలివరీకి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పది కోడిగుడ్లు కొంటే ఒక బ్రెడ్​ ప్యాకెట్​ ఉచితం. త్వరపడండి. "

- సోనూసూద్​, విలక్షణ నటుడు

కరోనా సంక్షోభంలో వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి సహాయ పడిన నటుడు సోనూసూద్​.. కొవిడ్​ రెండో దశలోనూ ఆక్సిజన్​ సిలిండర్లను పంపిణీ చేయడం సహా ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు లాక్​డౌన్​లో అవసరమైన వారికి అనేక విధాలుగా సహాయసహకారాలు అందించాడు.

సోనూసూద్​.. 'కిసాన్​'(Kisaan) అనే సినిమాను రూపొందించినున్నట్లు ఇటీవలే ఓ ప్రకటన చేశారు. ఈ సినిమాకు ఇ.నివాస్​ దర్శకత్వం వహిస్తుండగా.. రాజ్​ షాండిల్యా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇదీ చూడండి.. Sonusood: సివిల్స్ అభ్యర్థుల కోసం స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్

Last Updated : Jun 24, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.