ETV Bharat / sitara

సోనూసూద్​పై అభిమాని అద్భుత స్కెచ్​ - సోనూసూద్​ స్కెచ్​

లాక్​డౌన్​లో వలసకార్మికులకు సాయం చేస్తూ వారి అభిమానాన్ని కూడగట్టుకుంటున్న సోనూసూద్​పై ఓ అభిమాని అద్భుతమైన కళతో ప్రేమను చాటాడు. వలస కూలీల జీవన స్థితిగతులను ఉద్దేశిస్తూ.. సోనూ రూపం వచ్చేలా ఓ చిత్రాన్ని గీశాడు. ఈ స్కెచ్​ చూసిన సోనూ సంతోషం వ్యక్తం చేశారు.

SONUSOOD ARTIST
సోనూసూద్​ స్కెచ్​
author img

By

Published : Jun 11, 2020, 5:46 AM IST

లాక్​డౌన్​ సమయంలో వలసకార్మికులకు అండగా నిలుస్తూ.. వారి పాలిట దైవంగా మారారు ప్రముఖ బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఓ కళాకారుడు అద్భుతమైన స్కెచ్​​ వేశాడు. అసోంకు చెందిన రణ్​బీర్​ బార్​ అనే కళాకారుడు వలస కార్మికుల జీవన స్థితిగతులను ఉద్దేశిస్తూ సోనూసూద్​ రూపం వచ్చేలా చిత్రాన్ని గీశాడు.

​ ఫొటోను చూసిన సోనూ ట్విట్టర్​లో షేర్​ చేసి సంతోషం వ్యక్తం చేశారు.​ ఈ స్కెచ్​తో తన జీవితానికి ఓ గుర్తింపు లభించినట్లైందని తెలిపారు. ఇంతటి అద్భుతమైన కళాత్మకతకు ప్రాణం పోసిన ఆర్టిస్ట్​ను తాను కలవాలనుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.