ETV Bharat / sitara

Sonu Sood: ప్రధాని కావాలన్న వ్యాఖ్యలతో ఏకీభవించను - హ్యూమా ఖురేషి వార్తలు

కరోనా సంక్షోభంలో(corona lockdown) ఎంతోమందికి సహాయపడుతున్న నటుడు సోనూసూద్​(Sonu Sood)ను పలువురు​ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్న సోనూ.. ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు బాలీవుడ్​ నటి హూమా ఖురేషి(Huma Qureshi) అన్నారు. దీనిపై స్పందించిన సోనూసూద్​.. ఆమె వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని చెప్పారు.

Sonu Sood reacts on Huma Qureshi's choice for prime minister
Sonu Sood: ప్రధాని కావాలన్న వ్యాఖ్యలతో ఏకీభవించను
author img

By

Published : Jun 6, 2021, 9:45 AM IST

Updated : Jun 6, 2021, 11:36 AM IST

గతేడాది కొవిడ్‌-19 లాక్‌డౌన్(corona lockdown) కారణంగా ఇబ్బందులు పడ్డ ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేశారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌(Sonu Sood). అప్పటి నుంచి ఇప్పుడు కరోనా రెండో దశలోనూ దేశంలో ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పందిస్తూ ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. దాంతో చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్​ నటి హూమా ఖురేషి(Huma Qureshi).. సోనూసూద్​ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలపై నటుడు సోనూసూద్​ స్పందించారు.

Sonu Sood reacts on Huma Qureshi's choice for prime minister
హూమా ఖురేషి

"ఆమె నా గురించి ఇలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. నేను ఈ గౌరవానికి అర్హుడిని అనుకుంటే, నేను తప్పక ఏదైనా మంచి పని చేశాననే చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాటలకు నేను ఏకీభవించను. ఇప్పుడు మనకు సమర్ధవంతమైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే చిన్నవయసులోనే రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆయన విశిష్టమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అయితే నాకు అంత అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని వారు అక్కడ చాలామంది ఉన్నారు. నా గురించి వారు కలత చెందాలని కోరుకోను. నేను నా పని చేయడం చాలా ముఖ్యం. నటుడిగా సంతృప్తిగా రాణిస్తున్నాను. ఇప్పుడు సామాన్యుల కష్టాలలో ఒకడిగా భాగం పంచుకుంటున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మనందరం కలిసి పనిచేయగలమని అనుకుంటున్నా."

- సోనూసూద్​, విలక్షణ​ నటుడు

ప్రస్తుతం సోనూసూద్‌ తెలుగులో చిరంజీవితో కలిసి 'ఆచార్య'(Acharya) చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న 'పృథ్వీరాజ్‌'(Prithviraj) చిత్రంలో కవిగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి: రామ్​గోపాల్​ వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్​?

Last Updated : Jun 6, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.