ETV Bharat / sitara

Sonu Sood​ ఫౌండేషన్​.. ఇచ్చట ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు ఉచితం! - sonu sood foundation

ఆక్సిజన్​ దొరక్క ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు సోనూసూద్(Sonu Sood)​ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్​ అవసరమైన వాళ్లు ఆన్​లైన్​లో నమోదు చేసుకుంటే వారికి ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను(oxygen concentrator) ఉచితంగా అందించనున్నట్లు సోనూ తెలిపారు.

Sonu Sood: Oxygen concentrators for free for corona victims
సోనూసూద్​
author img

By

Published : May 28, 2021, 7:28 PM IST

కరోనా మహమ్మారి జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పుడు అనేకమంది ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఆక్సిజన్‌ అందిస్తానని అంటున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్‌(Sonu Sood)​. కరోనా తెచ్చిన కష్టకాలంలో హీరోగా నిలబడి ఎందరినో ఆదుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.

ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను(oxygen concentrator) సూద్​ ఫౌండేషన్​ ద్వారా ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు. (http://umeedbysonusood.com) ఈ లింక్​ ఓపెన్​ చేసి రిజిష్టర్​ చేసుకున్న వారికి ఉచితంగా ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను అందిస్తామని సోనూ తెలిపారు. అది కూడా అత్యవసరమైన వారికేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసం డీటీడీసీ కొరియర్స్​, తుష్టి ఫౌండేషన్​తో పాటు మరో రెండు స్వచ్ఛంద సంస్థలతో సోనూ చేతులు కలిపారు.

ఇదీ చూడండి: ఒక్క మిస్డ్ కాల్.. ఆక్సిజన్​ అందిస్తాం: సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.