ETV Bharat / sitara

సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు వసతి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. 20 వేల మంది వలసకూలీలకు వసతి కల్పించారు. వారందరికీ నోయిడాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు ఉద్యోగాలు
నటుడు సోనూసూద్
author img

By

Published : Aug 24, 2020, 4:14 PM IST

Updated : Aug 24, 2020, 4:38 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్.. 'ప్రవాసీ రోజ్​గర్' కార్యక్రమంలో భాగంగా 20 వేలమంది వలసకూలీలకు వసతి కల్పించినట్లు సోమవారం వెల్లడించారు. దీనితో పాటే నోయిడాలోని గార్మెంట్స్​ సంస్థలో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

"ప్రవాసీ రోజ్​గర్'లో భాగంగా 20 వేల మంది కూలీలకు వసతి కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. వారందరూ నోయిడాలోని గార్మెంట్స్ సంస్థలో విధులు నిర్వర్తించనున్నారు" -సోనూసూద్ ట్వీట్

Sonu Sood offers accommodation to 20,000 migrant workers
సోనూసూద్ ట్వీట్ చేసిన ఫొటో

మార్చిలో దేశంలో లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలకు సాయమందించారు సోనూసూద్. తన సొంత డబ్బులతో వారిని స్వస్థలాలకు చేర్చారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మనసులో చోటు సంపాదించారు.

కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం సోనూ, ప్రత్యేక యాప్​ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నయో ఇందులో తెలుసుకోవచ్చు.

వలసకూలీల కోసం ఇప్పటికే టోల్​ ఫ్రీ నెంబర్​తో పాటు వాట్సాప్​ నెంబర్​ను అందుబాటులో ఉంచింది సోనూసూద్ బృందం. వీరిని సంప్రదిస్తే పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతారు.

Last Updated : Aug 24, 2020, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.