కరోనా కారణంగా ఇరుక్కుపోయిన వలసకూలీలను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్.. తాజాగా వారికి మరో సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికోసం ఓ కొత్త యాప్‌ను ఆవిష్కరించారు. 'ప్రవాసీ రోజ్‌గార్' పేరుతో ఉచిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడం సహా వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ యాప్ కార్మికులకు సహకారం అందిస్తుంది.
నిర్మాణం, ఆరోగ్యం, ఇంజినీరింగ్, బీపీఓ, సెక్యూరిటీ, ఆటోమొబైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ సెక్టార్స్, ఇతర ఉద్యోగ అవకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. ఇంగ్లీష్ సహా ఉద్యోగ శిక్షణ నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని ఇందులో అందుబాటులో ఉంచారు.
రచయితగా
లాక్డౌన్లో వేల మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేరవేశారు ప్రముఖ నటుడు సోనూసూద్. అయితే ఇదంతా ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ అనుభూతికి అక్షర రూపాన్ని ఇచ్చి 'లైఫ్ ఛేంజింగ్' పేరిట పుస్తకం రాయనున్నట్లు తెలిపారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా.. ఈ పుస్తకాన్ని ప్రచురించనుందని వెల్లడించారు.
ఇది చూడండి : కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న వేల మందికి సోనూ సాయం