మహాభారతంలోని ఒక అధ్యాయం ఆధారంగా "కురుక్షేత్ర" అనే కన్నడ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అర్జునుడి పాత్రలో సోనూసూద్ నటించనున్నాడు.
"కురుక్షేత్ర" చాలా ప్రత్యేకమైన చిత్రం. నేను చేసిన అతి పెద్ద చిత్రాలలో ఇది ఒకటి. అర్జునుడి పాత్రలో నేను కనిపిస్తాను. ఇతర భాషలల్లోనూ ఈ సినిమా డబ్ అవుతుంది. -సోనూసూద్, నటుడు
నాగన్న దర్శకత్వం వహించారు. రచయిత రన్న రాసిన 'గదయుద్ధ' పద్యం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.
కన్నడలో అత్యంత ఖరీదైన చిత్రం "కురుక్షేత్ర." ఇందులో యుద్ధ సన్నివేశాలు త్రీడిలో ఉండనున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ హీరో దర్శన్, దివంగత నటుడు అంబరీష్ తదితరులు నటించారు. ఐదు భాషల్లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">