ETV Bharat / sitara

Sonu Sood IT Survey: వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు

సోనూసూద్‌ కార్యాలయాల్లో(Sonu Sood IT Survey) ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు(Sonu Sood IT Raid).. పన్ను ఎగవేతను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sonu Sood: IT Surveys Continue for Third Day in Sonu Sood Premises
Sonu Sood IT Survey: వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు
author img

By

Published : Sep 17, 2021, 12:56 PM IST

Updated : Sep 17, 2021, 1:08 PM IST

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు(Sonu Sood IT Survey) కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు(Sonu Sood IT Raid).. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబయిలోని ఆయన నివాసంతోపాటు నాగ్‌పుర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు.

ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలీవుడ్‌ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలుస్తోంది. సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఐటీ అధికారులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.

పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సోనూసూద్‌కు(Sonu Sood News) చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. "లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించాం" అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. గురువారం మరోసారి సోనూ నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో(Sonu Sood Real Estate) ఒప్పందం గురించి ప్రశ్నించినట్లు సమాచారం.

ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ 'ఆప్‌ ప్రభుత్వం(Sonu Sood AAP Party) ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు చర్చనీయాంశమయ్యాయి.

సోనూ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొవిడ్‌ వేళ వలస కూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి.. Sonu Sood: సోనూసూద్​ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Last Updated : Sep 17, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.