ETV Bharat / sitara

సోనూసూద్ గొప్ప మనసు.. ఉచితంగా న్యాయ విద్య - సోనూసూద్ సాయం

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి దేశంలో చాలామంది సమస్యలు తీర్చుతూ గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్. ఇప్పుడు న్యాయ విద్య చదవాలన్న కోరిక ఉన్న వారికి ఉచితంగా విద్య అందించనున్నట్లు తెలిపారు.

sonu sood help
సోనూసూద్
author img

By

Published : Aug 3, 2021, 1:09 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్.. లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. పేద విద్యార్ధులకూ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇటీవల, ఐఏఎస్ పరీక్షలకు శిక్షణ తీసుకునేవారికి స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేశారు. సీఏ చదవాలనుకునే వారికోసం ఉచిత విద్యను ప్రారంభించారు. ఇప్పుడు న్యాయ విద్యను చదవాలనుకునేవారీకీ ఉచిత విద్యను అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం soodcharityfoundation.org వెబ్​సైట్​లోకి లాగిన్​ అయి వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఓవైపు తనకు తోచిన సాయం చేస్తున్న సోనూసూద్.. మరోవైపు పలు భాషల్లో సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ రెండు, మూడు చిత్రాలకు అంగీకారం తెలిపారు.

ఇవీ చదవండి:sonu sood: ఒకప్పుడు తిరస్కరణ.. ఇప్పుడు ప్రశంసలు!

కాలినడకన ముంబయి వచ్చిన వ్యక్తికి సోనూ భరోసా

Sonusood: సివిల్స్ అభ్యర్థుల కోసం స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్

Sonu Sood: సోనూసూద్​ను పూర్తిగా మార్చేసిన ఆ సంఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.