ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధిలేక చిక్కుకున్న వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించాడు. సోమవారం ఈ బస్సులు థానే, (మహారాష్ట్ర), గుల్బర్గా (కర్ణాటక) నుంచి బయలుదేరాయి. ఈ సందర్భంగా సోనూసూద్ థానేలోని బస్టాప్‌ల వద్దకు వెళ్లాడు. కార్మికులకు గుడ్‌బై చెప్పాడు.
-
Love u farahhhhhhhh❣️❣️❣️❣️❣️❣️❣️ https://t.co/PA8ONQurLG
— sonu sood (@SonuSood) May 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Love u farahhhhhhhh❣️❣️❣️❣️❣️❣️❣️ https://t.co/PA8ONQurLG
— sonu sood (@SonuSood) May 12, 2020Love u farahhhhhhhh❣️❣️❣️❣️❣️❣️❣️ https://t.co/PA8ONQurLG
— sonu sood (@SonuSood) May 12, 2020
"ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు తమ కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే దేనితోనైనా పోరాడగలడనేది నా నమ్మకం. కొందరు వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి అధికారికంగా అనుమతులు తీసుకున్నా. పది బస్సులలో వారు ప్రయాణిస్తున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం ద్రవించింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా" అని ఈ సందర్భంగా సోనూ సూద్ తెలిపాడు.
ఆరోగ్య సిబ్బంది కోసం హోటల్
ఇటీవల సోనూ సూద్ పంజాబ్‌లోని వైద్యులకు 1,500 వ్యక్తిగత సంరక్షక పరికరాల కిట్లు అందించాడు. అంతేకాదు జుహూలోని తన హోటల్‌ను వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల వసతికై ఉపయోగించేందుకు ముందుకొచ్చాడు.
ఇదీ చూడండి.. 'చిరు' మనసును కదిలించిన పోలీసుతో మెగాస్టార్