ETV Bharat / sitara

పెళ్లి తర్వాతే జీవితం బాగుంది: సోనమ్ - anand ahuja

పెళ్లికి ముందు కంటే తర్వాతే తన జీవితం బాగుందని చెబుతుంది బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఆనంద్ ఆహుజా లాంటి భర్త దొరకడం తన అదృష్టమని తెలిపింది.

సోనమ్ కపూర్
author img

By

Published : Sep 15, 2019, 5:15 AM IST

Updated : Sep 30, 2019, 3:53 PM IST

'పెళ్లి అయితే జీవితం మన చేతిలో ఉండదు.. బాధ్యతలు వస్తాయి.. ఇంతకు ముందులా ఆనందంగా గడపలేం' అని చాలామంది అంటుంటారు. అయితే బాలీవుడ్ నటి సోనమ్ కపూర్​కు మాత్రం పెళ్లికి ముందు కంటే తర్వాతే జీవితం బాగుందంట. ఆనంద్ ఆహుజా లాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెబుతుందీ కథానాయిక.

"పెళ్లికి ముందు నా జీవితంలోకి కొత్త ఆనందం వచ్చి చేరింది. ఆనంద్‌ ఆహుజా లాంటి వ్యక్తి భర్తగా దొరకడం నాకు దక్కిన వరం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. ఇంతకుముందు కంటే ఆనంద్‌ను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇద్దరు ఒకరి పనికి ఒకరు విలువనిస్తాం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఇద్దరి కోసం సమయం కేటాయించుకుంటాం. ప్రతి విషయాన్ని పంచుకుంటాం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడే ఆ దాంపత్యజీవనం బాగుంటుంది. ఆ రెండూ మా మధ్య ఉన్నాయి"

- సోనమ్ కపూర్, బాలీవుడ్ నటి.

గత ఏడాది వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది సోనమ్ కపూర్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్​తో కలిసి ఆమె నటించిన 'జోయా ఫ్యాక్టర్​' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: ఆలయాలను చుట్టేస్తున్న కంగనా.. ఎందుకోసమో..!

New Delhi, Sep 14 (ANI): Union Home Minister and BJP president Amit Shah today inaugurated an exhibition showcasing the work done by Prime Minister Narendra Modi on September 14. BJP working president JP Nadda was also present at the exhibition. Leaders took stroll at the exhibition to view special banners depicting PM Modi's work as a politician.
Last Updated : Sep 30, 2019, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.