తెలుగు సినిమా.. ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్, తొలి చూపులోనే హీరోయిన్‌తో లవ్, అనంతరం డ్యూయెట్, ఇంటర్వెల్ ఫైట్/ట్విస్ట్, నాలుగు కామెడీ పంచ్‌లు, ఓ ఐటమ్ సాంగ్, క్లైమాక్స్‌లో భారీ పోరాటం.. ఇవన్నీ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంటాయి. ఈ పద్ధతికి స్వస్తి చెబుతూ విభిన్న కథాకథనాలతో కొన్ని సినిమాలు దూసుకెళ్తున్నాయి. రెండేళ్లలో వచ్చిన ఇలాంటి కొన్ని చిత్రాలపై ఓ లుక్కేద్దాం!
డియర్ కామ్రేడ్ (కాకినాడ)
మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. క్లాసిక్ లవ్‌స్టోరీగా వచ్చి ప్రేక్షకులకు సందేశాన్ని అందించిందీ సినిమా. కథ దాదాపు కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ మూవీకి మిశ్రమం స్పందన లభిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నెల్లూరు)
నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రం.. మనుషుల ఆధ్యాత్మిక సంప్రదాయాలను అడ్డుపెట్టుకుని దారుణాలకి పాల్పడే వారి ఆటకట్టించే ఓ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. నవీన్ పోలిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఎఫ్‌బీఐ నెల్లూరు పేరు తెలుగునాట బాగా పాపులర్ అయింది. డీసెంట్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా అంతా నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మల్లేశం (భువనగిరి)
పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింద మల్లేశం జీవితం ఆధారంగా తీసిన చిత్రం 'మల్లేశం'. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. మల్లేశానికి ఆయన ఊరికి ఉన్న సంబంధాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేశారు. వాస్తవానికి దగ్గరగా ఉండేలా మల్లేశం గ్రామంలోనే చిత్రీకరించారు. 1990ల్లోని గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేరాఫ్ కంచరపాలెం (కంచరపాలెం)
విశాఖ జిల్లా కంచరపాలెంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇందులో నటించిన చాలా మంది నటీనటులు ఆ ప్రాంతం వాళ్లే కావడం విశేషం. గతేడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది. నాలుగు పాత్రల చుట్టూ చిత్ర కథ తిరుగుతుంది. ఒక్కో పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫిదా (బాన్సువాడ)
బాన్సువాడ.. 'ఫిదా' చిత్రం రాకముందు ఈ ఊరు గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా రాకతో బాన్సువాడ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. 60 శాతం చిత్రాన్ని ఇక్కడే చిత్రీకరించారు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు నాట అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా వచ్చి రెండేళ్లైనా ఇందులోని పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శతమానం భవతి.. (ఆత్రేయపురం)
ఆత్రేయపురం అంటే పూతరేకులకు ఫేమస్.. కానీ 'శతమానం భవతి' చిత్రం వచ్చిన తర్వాత ఆ పాపులారిటి మరింత పెరిగింది. పచ్చని పంట పొలాలు, సెలయేళ్లతో అసలు పల్లెటూరు అంటే ఇలాగే ఉండాలి అనేంతలా ఈ సినిమాలో చూపించారు. చక్కటి కుటుంబ కథతో తెరెకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'శతమానం భవతి' సినిమా జాతీయ పురస్కారం అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">