ETV Bharat / sitara

'సోగ్గాడే చిన్నినాయనా'.. ప్రీక్వెల్‌ షురూ! - కృతి శెట్టి

చాలా ఏళ్ల తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ప్రీక్వెల్​గా రావాల్సిన 'బంగార్రాజు' కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.

Nagarjuna
నాగార్జున
author img

By

Published : Aug 2, 2021, 6:51 AM IST

'బంగార్రాజు' చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కథానాయకుడు నాగార్జున. 'సోగ్గాడే చిన్నినాయనా'కి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. కల్యాణ్‌కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూ సరసన కృతి శెట్టి కనిపించనున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి.

ఈ సినిమా చిత్రీకరణ ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనికి హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడా సెట్‌లోనే ముందుగా నాగార్జున, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం వినిపిస్తోంది. 'మనం' వంటి హిట్‌ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదీ చూడండి: అలాంటి వాడు భర్తగా రావాలి: కృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.