ETV Bharat / sitara

సామ్‌, సిద్ధార్థ్‌, జుకల్కర్‌.. ఈ ముగ్గురి పోస్ట్స్​పైనే చర్చ! - samantha instagram post

సమంత- నాగచైతన్య (Samantha Chaitanya) విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశారు. వారి ప్రకటను ముందు.. ఆ తర్వాత సామ్ (CHAYSAM), నటుడు సిద్ధార్థ్ చేసిన కొన్ని పోస్టులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

CHAYSAM
సమంత నాగ చైతన్య
author img

By

Published : Oct 3, 2021, 6:27 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సమంత‌-నాగచైతన్య (Samantha Chaitanya) తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశారు. దశాబ్దకాలంగా ప్రేమ.. నాలుగేళ్ల తమ (CHAYSAM) వైవాహిక బంధానికి స్వస్తి పలకడానికి కారణమేమై ఉంటుందా? అని ఇప్పుడు ఫ్యాన్స్​ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సామ్‌, ఆమె స్టైలిష్ట్‌ జుకల్కర్‌, నటుడు సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారాయి.

ప్రకటనకు కొన్ని గంటల ముందు సామ్‌ ఇలా..:

CHAYSAM
సమంత

తాము విడిపోతున్నట్లు (CHAYSAM Divorce) ప్రకటించడానికి కొన్ని గంటల ముందు సమంత పెట్టిన ఓ పోస్ట్ (Samantha Instagram) ఇప్పుడు చర్చకు దారి తీసింది. 'నేను నిరాశకు గురైనప్పుడు.. చరిత్రలో ఎప్పుడూ నిజం, ప్రేమే విజయం సాధించాయని గుర్తు చేసుకున్నాను. నియంతలు ఎంతమందైనా ఉండొచ్చు.. కొంతకాలం వాళ్లు అజేయంగా కనిపించవచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్లు కిందపడిపోక తప్పదు. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను' అంటూ సమంత పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా దీనిని వాళ్లమ్మ చెప్పిందని సామ్‌ (Samantha Viral News) తెలిపారు.

ప్రకటన తర్వాత సిద్ధార్థ్‌ ..:

siddharth tweet samantha
సిద్ధార్థ్‌

చై-సామ్‌ల సంయుక్త ప్రకటన తర్వాత నటుడు సిద్ధార్థ్‌ చేసిన ఓ ట్వీట్ (Siddharth Tweet Samantha) ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. 'మోసం చేసేవాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందరు.. స్కూల్‌లో ఉన్నప్పుడు మా టీచర్‌ నేర్పించిన పాఠాల్లో ఇది కూడా ఒకటి' అని ఆయన చేసిన ట్వీట్‌ అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

స్టైలిష్ట్‌ జుకల్కర్‌ ఏం పోస్ట్‌ చేశాడంటే..:

CHAYSAM
సమంత-నాగచైతన్య

గత కొన్ని సంవత్సరాల నుంచి సమంతకు వ్యక్తిగత స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తున్నారు (Samantha Preetham Jukalker) ప్రీతమ్‌ జుకల్కర్. తాజాగా ఆయన చేసిన పోస్ట్‌లు కూడా వైరల్‌గా మారాయి. 'నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి' అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశాడు. 'ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోను. ఎందుకంటే నేను ఈ భూమ్మీదకు వచ్చింది వాళ్ల మన్ననలు పొందడానికి కాదు. మంచి మనిషిగా ఉండటానికి. అలాగే ఉంటాను' ఇలా, సందేశాల రూపంలో ఆయన చేసిన పోస్టులు (Preetham Jukalker Instagram) ఇప్పుడు అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నాయి.

ఇవీ చూడండి:

chaysam divorce: మళ్లీ పేరు మార్చుకున్న సామ్​!

'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం'

అవును మేం విడిపోతున్నాం: చైతూ, సమంత ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.