ETV Bharat / sitara

sirivennela died: తెలుగు పాటకు వెలుగు బాట.. సిరివెన్నెల - సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం

sirivennela sitaramasastry died: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిమోనియా కారణంగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అభిమానులు, సినీప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్​ను ఓసారి గుర్తుచేసుకుందాం.

సిరివెన్నెల సీతరామశాస్త్రి మృతి, Siri vennela sitaramasasty died
సిరివెన్నెల సీతరామశాస్త్రి మృతి
author img

By

Published : Nov 30, 2021, 5:26 PM IST

సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కలాన్ని హలంగా చేసి తెలుగు చిత్రసీమలో పరిమళాల పాటలు పండించిన వాడు..
అలతి అలతి పదాలతో అందమైన బాణీలు కట్టి సినీ పాటల పూదోటలో సిరివెన్నెలలు కురిపించిన వాడు..

"లాలి జో లాలి జో" అంటూ.. అమ్మ ప్రేమకు తన కలంతో హారతి పట్టినా..

"నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని" అంటూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్న సమాజాన్ని నిలదీసినా..

"నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా" అంటూ.. యువతరానికి జీవిత పాఠాలు నేర్పినా.. అది సిరివెన్నెల కలం కురిపించిన సాహిత్యపు జల్లే అవుతుంది.

"శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ.." అంటూ మురిసిన మధుర భక్తుడాయన

"జగమంతా కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాదీ" అని చెప్పిన అద్భుతమైన సాహిత్యకారుడు..

చిత్రసీమను తన పాటల పూదోటలో విహరింపజేసిన సరస్వతి మాత ముద్దుబిడ్డ సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. నేడు(మంగళవారం) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్​ గురించి తెలుసుకుందాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"విధాత తలపున ప్రభవించినది.." సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవ్వడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను, జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతమంటే ప్రతి ఇంటా అదొక సుప్రభాత సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించని ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అదీ సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటల పూదండలు కట్టి తెలుగుభాషకు నీరాజనాలందించిన వాడు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.

"భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ"...అంటూ కాలేజీ యువకుడిగా సందడి చేసినా, "జాణవులే నెర జాణవులే.." అంటూ పడుచుపిల్లతో మెలోడీ ఆటలాడించినా సిరివెన్నెలకే సొంతం. అక్షరాలను ఆయుధాలుగా "నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని" అంటూ సమాజానికి పట్టిన నిర్లక్ష్యపు నిద్రమత్తును వదిలించిన వాడు ఆయన. మెలోడీ, క్లాస్‌, మాస్‌, రాక్‌, రాప్‌, అచ్చతెనుగు సంప్రదాయ గీతం ఇలా పాట ఏదైనా సిరివెన్నెల చేతిలో పడితే వెండితెరపై పండువెన్నెలు కురిపించాల్సిందే. అదే ఆయన ప్రత్యేకత.

తన సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల. పాట పాటకూ తన ఆలోచనా రూపాన్ని కలం పదును పెంచుకొని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్యస్థాయిని పెంచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు.

ఇంకొన్ని విషయాలు మీకోసం..

  • చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం
  • కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు
  • అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది
  • సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రి
  • దర్శకుడు కె.విశ్వనాధ్​తో అన్ని సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల
  • కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు
  • దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు
  • రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు
  • 2019లో పద్మశ్రీ వచ్చింది
  • కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్
  • ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు
  • 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసిన సిరివెన్నెల

ఇదీ చూడండి: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.