ETV Bharat / sitara

సుమధుర గాత్రం.. శ్రేయా ఘోషల్​ సొంతం - shreya ghoshal new updates

సుమధుర గాయనిగా దేశమంతటా గుర్తింపు పొందింది శ్రేయా ఘోషల్​. బాలీవుడ్​ 'దేవదాసు' నుంచి 'తాన్హాజీ' చిత్రం వరకు అంచెలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత గాయనీ గాయకుల సరసన చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. నేడు (మార్చి 12) శ్రేయా ఘోషల్​ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Singer Shreya Ghoshal celebrating 36th birthday
సుమధుర గాత్రం.. శ్రేయా ఘోషల్​ సొంతం
author img

By

Published : Mar 12, 2020, 5:46 AM IST

శ్రేయా ఘోషల్‌... భాషా భేదమెరుగని స్వరం ఆమె సొంతం. అందుకే తెలుగు, తమిళం, హిందీ అనే తేడాలేకుండా తేనెలూరే స్వరమాధుర్యంతో సినీ, సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. సంప్రదాయ సంగీతమైనా, పాశ్చాత్య గీతమైనా, ప్రేమ పాటలు, విరహగీతాలు, కవ్వించి కాలు కదిపించే ఐటెం గీతాలు.. ఏ తరహా పాటలైనా ఆమె గళంలో పడితే ఆణిముత్యాలై ప్రేక్షకుల మదిలో నాటుకుపోవాల్సిందే.

తనదైన వైవిధ్యమైన గానామృతంతో అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శ్రేయా. "దేవుల్లే మెచ్చింది. మీ ముందే జరిగింది. వేదంలా మిగిలింది. సీతారామ కథ వినుడి.." అంటూ ఎంత చక్కగా తన గొంతుతో భక్తిభావాన్ని పలికించగలదో.. అదే స్వరంతో "హే నాయక్‌.. తుహే లవ్‌ నాయక్‌.." అంటూ ఊపుతెప్పించే గీతాలతో కుర్రకారును ఉర్రూతలూగించగలదు.

Singer Shreya Ghoshal celebrating 36th birthday
శ్రేయా ఘోషల్‌

క్లాస్, మాస్, రాప్, రాక్‌ పాటేదైనా ఆమె వాణిలో ప్రతిధ్వనిస్తే చాలు "నువ్వేం మాయ చేశావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని.." అంటూ యువతరం తన స్వరంలో మైమరిచిపోతుంది. "నువ్వే నా శ్వాస.. మనసున నీకై అభిలాష.." అంటూ తన నోటి నుంచి ఇంకొక్క గీతమైన విని తరించాలని ఉవ్విళ్లూరుతుంది. "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా.." అంటూ వానపాటలతో అల్లరి చేయాలన్నా.. "సిగ్గేస్తుంది నిను చూస్తుంటే.. సిగ్గేస్తుంది నీ మాటింటే.." అంటూ రొమాంటిక్‌ గీతాలతో కవ్వించాలన్నా.. మదిలో మెదిలే తొలిపేరు శ్రేయా ఘోషలే. అందుకే దర్శక, నిర్మాతలు శ్రేయాతో తమ చిత్రాల్లో ఒక్కపాటైనా పాడించుకోవాలని చెవులు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు.

ఆ స్వర సరస్వతిది తెలుగు నేల కాదు...

"జగదానందకారక జయ జానకీ ప్రాణనాయకా.. శుభ స్వాగతం ప్రియ పరిపాలకా.." అంటూ 'శ్రీరామ రాజ్యం'లో రసరమ్యంగా శ్రేయా ఆలపించిన గీతం వింటే ఏ సినీ సంగీతాభిమానైనా ఆ స్వరం తెలుగు గడ్డ ముద్దు బిడ్డదేమో అని తలుస్తారు. ఎందుకంటే అంత అచ్చమైన తేటతెలుగు ఉచ్ఛారణతో అందరినీ కట్టిపడేసింది శ్రేయా ఘోషల్‌.

శ్రేయా పశ్చిమ బంగాల్​లో పుట్టిపెరిగింది. 1984 మార్చి 12న బంగాల్​లోని దుర్గాపూర్లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది. తండ్రి బిశ్వర్‌జీత్‌ ఘోషాల్, తల్లి సర్‌మిష్‌తా ఘోషల్‌. శ్రేయాకు సంగీతంలో తొలిగురువు తన తల్లే. నాల్గవ ఏట నుంచే తన తల్లి దగ్గర హార్మోనియం నేర్చుకోవడం మొదలుపెట్టింది. తర్వాత మహేష్‌ చంద్ర శర్మ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని అభ్యసించింది.

ఆ టీవీ షోతో గుర్తింపు..

చిన్నతనం నుంచే గాయనిగా ఎంతో ప్రతిభ చూపిన శ్రేయా ఘోషల్‌ కెరీర్‌ను మలుపుతిప్పిన సంవత్సరం 1996. ఆ ఏడాది ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'సరిగమప' పిల్లల పాటల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కించుకొని దానిలో విజేతగా నిలిచింది. ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా కల్యాణ్‌ జీ వీర్‌ జీ షాఫ్, సంజయ్‌ లీలా భన్సాలీ వ్యవహరించారు.

కల్యాణ్‌కు శ్రేయా ఘోషల్‌లోని సంగీత ప్రతిభ నచ్చడం వల్ల ఆమెకు తన వద్ద 18నెలల పాటు సంగీతంలో శిక్షణ ఇవ్వగా, దర్శకుడు సంజయ్‌ లీలా తన సినిమా 'దేవదాసు'తో శ్రేయాఘోషల్‌ను వెండితెరకు పరిచయం చేశాడు. ఆ చిత్రంలో శ్రేయా ఘోషల్‌ ఐదుపాటలు పాడి.. కథానాయిక పాత్రకు గాత్రదానం చేసింది. ఆ సినిమాలోని "బైరీ పియా.." పాటకు ఆమె భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్‌ అవార్డును దక్కించుకుంది.

భాషా ఎల్లలు చెరిపిన స్వర మాధుర్యం..

నేపథ్యగాయనిగా తొలినాళ్లలో హిందీ పరిశ్రమకే పరిమితమైన శ్రేయా ఘోషల్‌.. 'ఆల్బం' అనే తమిళ చిత్రంతో దక్షిణాదికి పరిచయమయ్యింది. తెలుగులో శ్రేయా తొలి సినిమా 'ఒక్కడు'. దాంట్లో ఆమె పాడిన 'నువ్వేం మాయ చేశావో గాని..' పాటతో టాలీవుడ్‌ ఇండస్ట్రీని తన స్వర మాయాజాలంలో పడేసింది శ్రేయా ఘోషల్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కడి నుంచి 'సైనికుడు', 'వర్షం', 'మిస్సమ్మ', 'ఆనంద్‌', 'అతడు', 'సీతయ్య', 'రెడీ', 'జై చిరంజీవ', 'శ్రీరామరాజ్యం', 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'నాయక్‌', 'ఎవడు', 'మనం' మొదలైన హిట్‌ చిత్రాల్లో చక్కటి గీతాలు ఆలపించి అందరినీ అలరించింది శ్రేయా ఘోషల్‌.

ముఖ్యంగా 'శ్రీరామ రాజ్యం' చిత్రంలో ఆమె పాడిన పాటలకు తెలుగునాట మంచి ఆదరణ లభించింది. మలయాళంలో శ్రేయా స్వరం వినిపించిన తొలి చిత్రం 'బిగ్‌ బి'. శ్రేయా ఇప్పటివరకు పాడిన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిలింఫేర్‌ అవార్డులు, మలయాళ, తమిళ రాష్ట్ర పురస్కారాలు లభించాయి.

వీటితో పాటు బెంగాలీ, పంజాబీ, మరాఠీ భాషల్లోనూ గాయనిగా తన ప్రతిభను చూపించింది. ఆ భాషల్లో ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాలు, ఐదు ఉత్తరాది, నాలుగు దక్షిణాది ఫిలింఫేర్‌ అవార్డులు దక్కించుకుంది.

ఇదీ చూడండి.. "మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.