దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడకు చెందిన సినీ పరిశ్రమలకు అవార్డులు ప్రకటించనున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే కన్నడం, మలయాళం, తమిళం భాషల్లోని కొన్ని విభాగాలకు అవార్డులు అందించగా.. తాజాగా సైమా-2019కి గానూ తెలుగు అవార్డులు ప్రకటించారు.
ఇందులో సైమా ఉత్తమ చిత్రంగా 'జెర్సీ' అవార్డు గెలుచుకుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'మహర్షి' (2019) సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'లో టైటిల్ సాంగ్ పాడిన అనురాగ్ కులకర్ణి ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డును గెలుచుకున్నారు.
సైమా 2019 అవార్డులు గెలుచుకున్న మరికొందరు..
- ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: స్వరూప్ ఆర్‌ఎస్‌జే (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ)
- ఉత్తమ తొలి చిత్ర నటుడు: శ్రీ సింహా (మత్తు వదలరా)
- ఉత్తమ తొలిచిత్ర నటి: శివాత్మిక (దొరసాని)
- ఉత్తమ తొలి నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
- ఉత్తమ కమెడియన్ : అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)
- ఉత్తమ సహాయ నటుడు : 'అల్లరి' నరేశ్ (మహర్షి)
ఇవీ చదవండి: