ETV Bharat / sitara

సెప్టెంబర్‌లో 'సైమా' వేడుక.. నామినేటైన చిత్రాలివే - యజమాన సైమా

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)-2019 అవార్డులకు నామినేట్ అయిన చిత్రాల జాబితా విడుదలైంది. ఇందులో తెలుగు నుంచి 'మహర్షి' పది నామినేషన్లు సాధించగా.. 'మజిలీ'కి తొమ్మిది నామినేషన్లు వచ్చాయి. ఇక ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం 'కుంబళంగి నైట్స్‌' ఏకంగా 13 నామినేషన్లు దక్కించుకుంది.

సైమా
సైమా
author img

By

Published : Aug 16, 2021, 8:38 PM IST

దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) వేడుక కరోనా కారణంతో మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోలేదు. తాజాగా.. 2019 ఏడాదికి సంబంధించి 'సైమా' పురస్కారాల ప్రదానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు 'సైమా' ఛైర్‌ పర్సన్‌ బృందాప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సెప్టెంబర్‌లో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు.

ఈసారి నామినేట్‌ అయిన సినిమాలు ఇండస్ట్రీలకు ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశించాయన్నారు. దీంతోపాటు వివిధ విభాగాల్లో నామినేట్‌ అయిన సినిమాలు.. అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా మహర్షి(తెలుగు), అసురన్‌(తమిళం), యజమాన(కన్నడ), కుంబళంగి నైట్స్(మలయాళం) చిత్రాలు నామినేషన్‌లో ముందంజలో నిలిచాయి.

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ చిత్రం పది నామినేషన్లతో ముందంజలో ఉండగా.. 'మజిలీ' 9, 'జెర్సీ' 7 నామినేషన్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన 'అసురన్‌' 10 నామినేషన్లు, కార్తీ చిత్రం నటించిన 'ఖైదీ' 8 నామినేషన్లతో ఉన్నాయి. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన 'కుంబళంగి నైట్స్‌' నుంచి ఏకంగా 13 నామినేషన్లు వచ్చాయి. కన్నడ చిత్రం 'యజమాన' నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి.

విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించునున్నారు. ప్రజలు www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తమ అభిమాన చిత్రానికి ఓట్లు వేయవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.