ETV Bharat / sitara

'అందుకే దానిపై మక్కువ పెంచుకున్నా' - శ్రుతిహాసన్​కి నచ్చే పాత్ర

సంగీతకారిణి పాత్రపై మక్కువ పెంచుకున్నానని చెబుతోంది శ్రుతిహాసన్​. మనసుల్ని ప్రతిబింబించే పాత్రల్ని చేసేప్పుడు నటించినట్లు అనిపించదని చెప్పుకొచ్చింది.

shruti haasan news
శ్రుతిహాసన్ కొత్త సినిమా
author img

By

Published : Aug 9, 2021, 7:17 AM IST

Updated : Aug 9, 2021, 8:02 AM IST

నటులకి కొన్ని కలల పాత్రలు ఉంటాయి. వాటిలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. శ్రుతిహాసన్‌కీ అలాంటి కలల పాత్రలు చాలానే ఉన్నాయట. అందులో ఒకటి సంగీతకారిణి పాత్ర. నిజ జీవితంలోనూ ఆమెకి సంగీతంతో మంచి అనుబంధం ఉంది. వేదికలెక్కి గళం విప్పుతుంది. ఇక ఇంట్లో ఉంటే అదే ప్రపంచం. సినిమాలకీ మ్యూజిక్‌ అందించింది. అందుకే సంగీతకారిణి పాత్రపై అంత మక్కువ పెంచుకున్నా అని చెబుతోంది శ్రుతి. "సొంత వ్యక్తిత్వాన్ని.. మనసుల్ని ప్రతిబింబించే పాత్రల్ని చాలానే చేశా. వాటిలో నటించినట్టు ఎప్పుడూ అనిపించలేదు. అలా అవకాశం వస్తే ఎన్నిసార్లైనా సంగీత కారిణి పాత్ర చేస్తా. తెరపై మనల్ని మనం చూసుకున్న అనుభూతి కలిగితే ఆ ఆనందమే వేరు కదా" అని చెప్పుకొచ్చింది శ్రుతి.

ప్రభాస్‌ ఆతిథ్యం: తొలిసారి ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది శ్రుతిహాసన్‌. ఈ జోడీతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌' తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్‌ సినిమా సెట్‌ అంటే నోరూరించే రుచులకి కేరాఫ్‌. అందుకే ప్రభాస్‌ ఆతిథ్యం గురించి, ఆయన పంచే రుచుల గురించి సహ నటులు ప్రత్యేకంగా చెప్పుకొంటుంటారు. శ్రుతి ప్రభాస్‌ ఆతిథ్యానికి ముగ్ధురాలైంది. మండి బిర్యానీ, గోంగూరు మాంసం మొదలుకొని 20 రకాల వంటకాల్ని శ్రుతి కోసం పంపించారు ప్రభాస్‌. నోరూరించే ఆ వంటకాలన్నిటినీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. వీటిని చూశాక నన్ను నేను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదని చెప్పుకొచ్చిందామె.

ఇదీ చదవండి: ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల రాకుమారుడు

Last Updated : Aug 9, 2021, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.