"విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న కుటుంబంలో నేను పుట్టాను. అది నా అదృష్టం" అంటోంది శ్రుతి హాసన్(shruti haasan salaar). ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్'తో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం 'సలార్'(salaar movie)లో ప్రభాస్(prabhas movies) సరసన నటిస్తోంది.
ఈ చిత్రం గురించి శ్రుతి(shruti haasan salaar) మాట్లాడుతూ ''సలార్' లాంటి చిత్రాల్లో నటించే అవకాశం నన్ను అన్ని భాషలవారికి దగ్గర చేస్తుంది. చిన్నప్పటి నుంచే తమిళం, హిందీ నేర్చుకున్నా. పదేళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడే తెలుగు బాగా నేర్చుకున్నా. ఎంతో గొప్ప వైవిధ్యం ఉన్న మన సంస్కృతిలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని చెప్పింది శ్రుతి హాసన్(shruti haasan salaar).
థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ సినిమాల హవా కొనసాగుతుంది. ఓటీటీ..థియేటర్..ఈ రెండింటిలో మీ ప్రాధాన్యం దేనికి? అని అడిగితే "కచ్చితంగా థియేటర్‌కే నా ప్రాధాన్యం. దానికి సమానమైన అనుభూతి ఎందులోనూ రాదు. దానికి ఏదీ పోటీయే కాదు. ఎలాంటి ఇబ్బంది, గోల లేకుండా చూసే సినిమాలు మాత్రమే ఓటీటీలో చూడగలం. చాలా సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. ఈలలు, గోల మధ్య చూస్తేనే ఆ మజా ఉంటుంది" అని చెప్పింది శ్రుతి(shruti haasan salaar).