ETV Bharat / sitara

shruti haasan bigg boss: బిగ్​బాస్​ హోస్ట్​గా శ్రుతిహాసన్​? - బిగ్​బాస్​ సీజన్​ 5

shruti haasan bigg boss: తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-5కు హోస్ట్‌గా నటి శ్రుతిహాసన్‌ వ్యవహరించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

shrutihassan
శ్రుతిహాసన్​
author img

By

Published : Nov 23, 2021, 9:35 PM IST

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-5కు హోస్ట్‌గా నటి శ్రుతిహాసన్‌ చేయనుందని సోషల్​మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ షోకు ఇప్పటివరకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన దిగ్గజ నటుడు కమల్‌హాసన్‌(kamal haasan bigg boss 5) సోమవారం కరోనా బారిన పడ్డారు. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న కమల్‌కు స్వల్ప కరోనా లక్షణాలు కనబడటం వల్ల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది(kamal haasan corona). ఆసుపత్రిలో ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారాయన.

దీంతో ప్రస్తుతం తమిళ్‌ బిగ్‌బాస్‌-5లో ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కమల్‌ స్థానంలో తాత్కాలికంగా..ఆయన కుమార్తె శ్రుతిని తీసుకున్నారనే మాట తెగ వినిపిస్తోంది. కమల్‌.. తన స్టైల్‌తో కంటెస్టెంట్లతో విభిన్నంగా వ్యవహరిస్తారని.. అంతటి స్థాయిలో ఎవరు మెప్పించగలరు? కొన్ని రోజుల పాటు షోను ఆసక్తికరంగా ఎవరు నడిపించగలరు? ఇలా పలు కోణాల్లో ఆలోచించిన షో మేకర్స్‌ ముందుగా శ్రుతిహాసన్‌ను సంప్రదించారట. దీనిపై శ్రుతి త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనుంది.

తెలుగులో గతేడాది బిగ్‌బాస్-4లో షూటింగ్‌ కారణంగా నటుడు నాగార్జున పాల్గొనలేని సందర్భాల్లో నటి రమ్యకృష్ణ, సమంత ఆయన స్థానంలో ప్రేక్షకులను అలరించారు. మరి తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఏమువుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి!

ఇదీచూడండి: హుషారుగా అనుపమ.. కేట్​ శర్మ హాట్​ ఫొటోషూట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.