తన సతీమణి శ్రియపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయమని ఆండ్రీ నెటిజన్లను కోరాడు. శ్రియ తరచూ సోషల్‌మీడియా వేదికగా డ్యాన్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. అనేక సందర్భాల్లో అవి వైరల్ అయ్యాయి. తాజాగా శ్రియ, ఆండ్రీ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫాలోవర్స్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ శ్రియ శరీరాన్ని ఉద్దేశించి కాస్త శృతిమించి మాట్లాడాడు. నెటిజన్ కామెంట్‌ను శ్రియ పట్టించుకోకపోయినా.. ఆమె భర్త ఆండ్రీ మాత్రం దానిపై ఫన్నీగా స్పందించాడు.
"మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. ఆమెపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి.. ప్లీజ్" అని రిప్లై ఇచ్చాడు. భర్త ఆ మాట అనగానే పక్కనున్న శ్రియ ఆయన్ను నవ్వుతూ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
2018 మార్చిలో రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్‌లో ఉన్నారు. తన భర్త కరోనా లక్షణాలతో బాధపడ్డాడని, కొన్ని రోజుల క్రితం కోలుకున్నాడని ఇటీవల శ్రియ చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">