ETV Bharat / sitara

అభిమానుల గుండె లయ.. అందాల తార శ్రియ - shreya birthday special story

అందం, అభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది స్టార్​ హీరోయిన్​ శ్రియ. నేడు ఆమె 39వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

shriya
శ్రియ
author img

By

Published : Sep 11, 2020, 5:32 AM IST

Updated : Sep 11, 2020, 6:25 AM IST

తొలిసారి స్క్రీన్​ మీద కనపడినప్పుడు ప్రేక్షకులు ఆమెను 'ఇష్టం'గా అక్కున చేర్చుకున్నారు. ఆమె నవ్వితే చాలు ప్రేక్షకుల గుండెల్లో 'సంతోషం' కలుగుతుంది. మా అభిమాన నటివి 'నువ్వే నువ్వే' అని ఆమెనే చూపించారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. కుర్రకారులైతే నీమీద ప్రేమను 'ఎలా చెప్పను' అని మనసునే పారేసుకున్నారు. అందుకే నీ ప్రతీ సినిమాకూ అభిమానంతో 'నేనున్నాను' అని ప్రతి ప్రేక్షకుడూ ఆమెతో అన్నారు. ఇంతలా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసిన తాను ఇంకెవరో కాదు.. శ్రియ శరన్‌ భట్నాగర్‌. అందం, అభినయం, ఆకర్షణ ఆమె సొంతం. నేడు శ్రియ 39వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

నేపథ్యం

శ్రియ పూర్తి పేరు శ్రియ శరన్‌ భట్నాగర్‌. పుష్పేంద్ర శరన్‌ భట్నాగర్, నీరజా శరన్‌ భట్నాగర్‌ దంపతులకు 1982 సెప్టెంబర్‌ 11న దెహ్రాదూన్​లో శ్రియ జన్మించింది. తండ్రి భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పని చేసేవారు. తల్లి కెమిస్ట్రీ టీచర్‌. శ్రియకు అభిరూప్‌ అనే సోదరుడు ఉన్నాడు. అతడు ముంబయిలో నివసిస్తున్నాడు. ఈ నటి బాల్యం ఎక్కువగా హరిద్వార్‌లో సాగింది. అక్కడ బీఎచ్‌ఈఎల్‌ కాలనీలో వీరి కుటుంబం ఉండేది. దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కళాశాలలో సాహిత్యంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పొందింది. శ్రియ మొదట తల్లి నీరజా శరన్‌ దగ్గరే కథక్, రాజస్థానీ ఫోక్‌ డాన్స్‌ నేర్చుకుంది. ఆ తర్వాత షోవన నారాయణ్‌ దగ్గర కథక్‌ డాన్స్‌ను అభ్యసించింది. కళాశాలలో తన గురువుతో ఎన్నో నాట్య బృందాలలో పాల్గొనేది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఉషాకిరణ్‌లో ఇష్టంగా

కళాశాలలో చదువుతున్నప్పుడు శ్రియకు మొదటిసారిగా కెమెరా ముందు కనిపించే అవకాశం వచ్చింది. నాట్య గురువు సిఫార్సుతో ఒక మ్యూజిక్‌ వీడియోలో అవకాశాన్ని దక్కించుకోగలిగింది శ్రియ. బనారస్‌లో షూట్‌ చేసిన ఈ వీడియో రామోజీ ఫిలింస్‌ దృష్టిలో పడింది. దాంతో 'ఇష్టం' సినిమాలో నేహా పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోగలిగింది. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే నాలుగు సినిమాల్లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వాటిలో 'నువ్వే నువ్వే' సినిమా కూడా ఉంది. 'సంతోషం' సినిమా శ్రియకు మొదటి కమర్షియల్‌ విజయాన్ని అందించింది.

బాలీవుడ్‌లోకి

మొదటిసారి 'తుజే మేరీ కసం' అనే సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది శ్రియ. ఈ చిత్రంలో రితేష్‌ దేశముఖ్, జెనీలియా డిసౌజ హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులో శ్రియ నటించిన 'ఠాగూర్'‌ సినిమా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల వేడుకలో ప్రదర్శనకు నోచుకుంది. అలాగే ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆ తరువాత తమిళ్లో ఎనక్కు 20 ఉనక్కు 18 (నీ మనసు నాకు తెలుసు) సినిమాలో తరుణ్, త్రిషలతో స్కీన్ర్‌ని షేర్‌ చేసుకుంది. ఈ చిత్రంలో శ్రియ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటించింది. 'నేనున్నాను' సినిమాలో క్లాసికల్‌ గాయనిగా శ్రియ కనిపించింది.

2005లో 10 సినిమాలు విడుదల

2005 సంవత్సరంలో శ్రియ నటించిన పది సినిమాలు విడుదలైతే... వాటిలో తొమ్మిది తెలుగు చిత్రాలే. వాటిలో ఎక్కువ గుర్తింపు పొందిన చిత్రం 'ఛత్రపతి'. ఇందులో మొదటిసారి ప్రభాస్‌ సరసన శ్రియ నటించి.. ఈ సినిమాలోని నటనకు గానూ మొదటిసారి ఫిలింఫేర్‌ బెస్ట్‌ తెలుగు నటి అవార్డుకు ఎంపికైంది. 'వర్షం' సినిమా తమిళ రీమేక్‌లో కథానాయికగా తమిళ ప్రేక్షకులను పలకరించింది శ్రియ. 2005లో కేవలం మూడంటే మూడు పాత్రలతో రూపొందిన 'మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు' అనే సినిమాలో నటించింది శ్రియ. 'బొమ్మలాట' అనే బాలల సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ఇది తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును అందుకొంది.

తమిళ్‌ సూపర్‌ స్టార్‌తో

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన 'శివాజీ' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం శ్రియను వరించింది. ఈ సినిమాలో శ్రియ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఈ సినిమాలో పోషించిన పాత్ర శ్రియని దక్షిణాది సినిమా పరిశ్రమలోనే ఓ స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది. ఆ తర్వాత దేవదాసు, మున్నా, తులసి ఇతర సినిమాలలో ప్రత్యేక పాటలలో మెరిసింది. 2007 సంవత్సరంలో నాలుగు భాషలలో ఆరు చిత్రాల్లో నటించింది శ్రియ.

ఐదేళ్ల తరువాత టాలీవుడ్‌కి

మలయాళ, తమిళ, ఇంగ్లీష్‌ చిత్రాలతో బిజీగా ఉన్న శ్రియ ఐదేళ్ల తరువాత మాస్‌ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన 'డాన్‌ శీను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. యాక్షన్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయవంతమైంది. రొమాంటిక్‌ సీన్లతో, డాన్సులతో ప్రేక్షకుల దృష్టిని శ్రియ ప్రధానంగా ఆకర్షించగలిగిందని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. 2005 తరువాత 2010లో శ్రియ మళ్లీ బాగా బిజీ అయింది. నాలుగు భాషలలో ఎనిమిది సినిమాలలో శ్రియ నటించింది.

మరికొన్ని మెరుపులు

'జిల్లా ఘజియాబాద్'‌ అనే సినిమాలో హిందీలో మొదటిసారి ఐటెం నెంబర్‌కి చిందులు వేసింది శ్రియ. ఆ తరువాత తెలుగులో 'పవిత్ర' సినిమాలో నటించిన శ్రియ 'మనం'తో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 'గోపాల గోపాల' చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా నటించింది. హిందీ 'దృశ్యం' సినిమాలో అజయ్‌ దేవగన్‌కు భార్యగా నటించి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకోగలిగింది. 'ఊపిరి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసిన శ్రియ బాలకృష్ణ వందవ సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో నటించింది.

ఇదీ చూడండి వైరల్: చిరు ఖతర్నాక్ లుక్.. సినిమా కోసమేనా?

Last Updated : Sep 11, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.