ETV Bharat / sitara

'మిషన్​ ఇంపాజిబుల్'​కు కరోనా ఎఫెక్ట్​

author img

By

Published : Feb 26, 2020, 12:00 PM IST

Updated : Mar 2, 2020, 3:08 PM IST

హాలీవుడ్ యాక్షన్​ మూవీ 'మిషన్​ ఇంపాజిబుల్​ 7' సినిమా షూటింగ్​ వాయిదా పడింది. ఇటలీలో కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా మూడు వారాల పాటు చిత్రీకరణను రద్దు చేసింది చిత్రబృందం.

Shoot of Tom Cruise starrer Mission: Impossible 7 cancelled in Italy
మిషన్​ ఇంపాజిబుల్​కు కరోనా ఎఫెక్ట్​

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హాలీవుడ్‌పైనా పడింది. 'మిషన్​ ఇంపాజిబుల్​ 7' చిత్రబృందం ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసింది. అయితే ఆ దేశంలో కరోనా (కొవిడ్​-19) వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండటం వల్ల చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది.

Shoot of Tom Cruise starrer Mission: Impossible 7 cancelled in Italy
'మిషన్​ ఇంపాజిబుల్​ 7' చిత్రీకరణలో ఓ దృశ్యం

'మిషన్​ ఇంపాజిబుల్​' సిరీస్​ నుంచి ఇప్పటివరకు ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్‌పై ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి.. 'అరణ్య' కోసం రెండేళ్ల అజ్ఞాతవాసంలో రానా

Last Updated : Mar 2, 2020, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.