Pawan krish movie shooting: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంతకాలం క్రితం కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇంతవరకూ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లలేదు.
అయితే డిసెంబరు తొలి వారంలో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభించాలని చిత్రబృందం భావించింది. కానీ ఇప్పుడది కుదరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పవన్.. 'భీమ్లానాయక్' చిత్రీకరణ, డబ్బింగ్ పనుల్లో బిజీ అయ్యారు. మషల్మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్రోవైపు, దర్శకుడు క్రిష్ కూడా రాజస్థాన్‌లో లొకేషన్స్‌లో వేటలో ఉన్నారని తెలిసింది. సో అవుతున్నాయి. ఈ కారణంగా.. జనవరిలో 'భీమ్లానాయక్' రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం నిర్ణయించుకుందట!
ఇక ఈ మువీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోందీ సినిమా.
![హరిహరవీరమల్లు సినిమా షూటింగ్, Harihara veeramallu cinema shooting postpone. pawan krish movie shooting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13752306_krish.jpg)
కాగా, పవన్.. జనవరి 12న 'భీమ్లానాయక్'తో(Pawankalyan bheemlanayak movie) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తుండగా.. రానా, నిత్యామేనన్, సంయుక్తమేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటే హరీశ్‌శంకర్(Pawan harishshankar movie) దర్శకత్వంలో రూపొందనున్న 'భవదీయుడు భగత్ సింగ్'లోనూ పవన్ నటించనున్నారు.
ఇదీ చూడండి: ఇకపై నయన్-విఘ్నేశ్ మకాం అక్కడే!