ETV Bharat / sitara

ఓటీటీలోనూ హవా చూపిస్తున్న 'శ్రీకారం' - ఓటీటీలోనూ హవా చూపిస్తున్న 'శ్రీకారం'

యువ హీరో శర్వానంద్​, ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధానపాత్రల్లో బి.కిషోర్ తెరకెక్కించిన చిత్రం 'శ్రీకారం'. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోనూ రిలీజైంది. తాజాగా ఇక్కడ కూడా సందడి చేస్తోంది.

Sreekaram
శ్రీకారం
author img

By

Published : May 1, 2021, 5:32 AM IST

యువ కథానాయకుడు శర్వానంద్‌ కీలక పాత్రలో బి.కిషోర్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. విడుదలైన కొద్దిరోజులకే సన్​నెక్ట్స్​ యాప్​లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది.

త‌రాలుగా సాగుతున్న వ్యవసాయ పరిస్థితిని మార్చి, కొత్త పుంత‌లు తొక్కించడానికి ఓ యువకుడు ఏం చేశాడు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేయడం వెనుక కారణం ఏంటి?వ్యవసాయం చేసే క్రమంలో ఆ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్న ఇతివృత్తంతో సినిమాను తెరకెక్కించారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. విమర్శకులనూ మెప్పించింది.

14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చారు. సాయికుమార్‌, మురళీశర్మ, రావు రమేశ్‌, నరేశ్‌, ఆమని తదితరులు కీలక పాత్ర పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.