ETV Bharat / sitara

ఇద్దరు బ్యాడ్​బాయ్స్​ కథే 'మహాసముద్రం'!

author img

By

Published : Jan 19, 2021, 9:46 AM IST

'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్​, సిద్ధార్ధ్​ బ్యాడ్​బాయ్స్​గా కనిపించనున్నారట. ఇందులో వీరిద్దరి మధ్య ఓ యాక్షన్​ సన్నివేశం ఉంటుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Sharwanand and Siddharth were playing the Negative roles in the movie of Mahasamudram
ఇద్దరు బ్యాడ్​బాయ్స్​ కథే 'మహాసముద్రం'!

'ఆర్​ఎక్స్​ 100' ఫేమ్ అజయ్​ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త చిత్రం 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్​-సిద్ధార్ధ్​ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. శర్వానంద్​ కెరీర్​లో 'గమ్యం', 'ప్రస్థానం' తర్వాత మళ్లీ అలాంటి బలమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారట. ఈ సినిమాలో శర్వా, సిద్ధార్ధ్​ బ్యాడ్​బాయ్స్​గా నటించనున్నారని.. వారి మధ్య ఓ యాక్షన్​ సన్నివేశం కూడా ఉందని సమాచారం.

ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్​గా​ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మహాసముద్రం'.. త్వరలోనే రెండో షెడ్యూల్​ను సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలోనే సినిమాను రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: బాబాయ్​-అబ్బాయ్​లతో శంకర్​ భారీ మల్టీస్టారర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.