అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న 'జీరో' చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల కాస్త విరామం తీసుకున్నాడు షారుఖ్ ఖాన్. అయితే ఈ స్టార్ హీరో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని నెట్టింట పెద్ద చర్చ జరిగింది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తర్వాత చేయబోయే సినిమాలపై స్పష్టతనిచ్చాడు. నకిలీ వార్తలను నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు స్పష్టం చేశాడు షారుఖ్.
" నేను చాలా సినిమాలు చేస్తున్నానని చాలా మంది రూమర్లు సృష్టిస్తున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ నేను సినిమా చేస్తే కచ్చితంగా దాని గురించి మీకు చెప్తాను. అలా చెప్పలేనివన్నీ కల్పితాలే."
- షారుఖ్ ఖాన్, సినీ నటుడు
-
It’s always nice to know that in my absence & behind my back , I have surreptitiously signed so many films that even I am not aware of!! Boys & girls I do a film when I say I am doing it....otherwise it’s just post truth.
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s always nice to know that in my absence & behind my back , I have surreptitiously signed so many films that even I am not aware of!! Boys & girls I do a film when I say I am doing it....otherwise it’s just post truth.
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2019It’s always nice to know that in my absence & behind my back , I have surreptitiously signed so many films that even I am not aware of!! Boys & girls I do a film when I say I am doing it....otherwise it’s just post truth.
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2019
ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ 'ధూమ్ 4' తెరకెక్కిస్తున్నాడని.. అందులో షారుఖ్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమా, సంజయ్ లీలా భన్సాలీ తీస్తోన్న 'షాహిర్ లుధియాన్వి' బయోపిక్‌లోనూ షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడని పుకార్లు వినిపించాయి. రాకేశ్ శర్మ బయోపిక్, ఫర్హాన్ అక్తర్ తీస్తోన్న 'డాన్3'లో కింగ్‌ఖాన్ ప్రధానపోత్ర పోషిస్తున్నట్లు గాసిప్స్ వినిపించాయి.
ప్రస్తుతం ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి 'బార్డ్ ఆఫ్ బ్లడ్' అనే సిరీస్‌ను నిర్మిస్తున్నాడు బాలీవుడ్ బాద్షా. ఇందులో ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సిరీస్.. సెప్టెంబర్ 27న మొబైల్ తెరలపై సందడి చేయనుంది.
ఇవీ చూడండి...