ETV Bharat / sitara

నిజ జీవిత ఘటనలతో రవితేజ కొత్త చిత్రం

author img

By

Published : Apr 12, 2021, 6:30 AM IST

మాస్ మహారాజా రవితేజ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో 'కో2'తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Raviteja
రవితేజ

రవితేజ మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఈ వారంలోనే ప్రారంభం కానుంది. తమిళంలో 'కో2' చిత్రానికి దర్శకుడిగా చేశారు శరత్. అలాగే అజిత్‌, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌ తదితర అగ్ర కథానాయకుల సినిమాలకు రచయితగా పనిచేశారు.

తెలుగువారైన ఆయన నిజ జీవిత సంఘటనల ఆధారంగా.. రవితేజ కోసం ఓ కథని సిద్ధం చేసి ఇటీవలే వినిపించారు. అది నచ్చడం వల్ల వెంటనే పచ్చజెండా ఊపేశారు రవితేజ. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకి చోటుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. శ్యామ్‌ సి.ఎస్‌.స్వరాలు సమకూరుస్తారు.

ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి'లో నటిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయడానికి ఒప్పుకొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్‌'తో విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ.. వరుస చిత్రాలతో జోరు పెంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.