బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, వెండితెరపై కనిపించి దాదాపుగా రెండేళ్లు అయిపోయింది. వరుస ప్లాఫ్లు ఎదురవడం వల్ల ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చాలా కథలు విన్నారు. కొన్నింటికి గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అందులో భాగంగానే 'పఠాన్' ముందుగా మొదలు కానుంది. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 'వార్'తో హిట్ కొట్టిన సిద్థార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.దీపికా పదుకొణె హీరోయిన్. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా కథతో తీస్తున్న ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
షారుక్ నిర్మాతగా 'లవ్ హాస్టల్'
విక్రాంత్ మస్సే, సన్యా మల్హోత్రా, బాబీ దేఓల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'లవ్ హాస్టల్'. దీనిని షారుక్ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, దృశ్యమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓ యువ ప్రేమ జంట, కిరాయి హంతకుడి మధ్య సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శంకర్ రామన్ దర్శకుడు. వచ్చే ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి:'శ్రీదేవి సోడా సెంటర్'లో హీరో సుధీర్‌బాబు