బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. చివరగా 'జీరో'లో కనిపించాడు. ఆ సినిమా వచ్చి, దాదాపు ఏడాది గడిచింది. ఆ తర్వాత అతడి నుంచి మరో చిత్రం రాలేదు. కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఎంతకీ మొదలుకాకపోవడమేంటి? అనే ప్రశ్న అభిమానులకు మనసు తొలిచేస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కింగ్ ఖాన్ ఈ కొత్త చిత్రాన్ని ఒప్పుకున్నప్పటికీ, వెనక్కు తగ్గాడట. అందుకు కారణం అట్లీ చెప్పిన స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అందులో కొన్ని మార్పులు కోరాడట షారుక్. దీంతో ఈ యువ దర్శకుడు స్క్రిప్ట్‌తో కుస్తీ పడుతూ బాద్షాను మెప్పించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడట.
షారుక్‌కు అట్లీతో కచ్చితంగా చేయాలనే ఆలోచన ఉంది. ఆలస్యమైనా సరే.. కథను పకడ్బందీగా సిద్ధం చేసుకురమ్మని ఈ డైరక్టర్‌కు ఖాన్ చెప్పాడట.