బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. 'జోరో' గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో జాగ్రత్త పడుతున్నాడీ హీరో. అయితే ఓ అభిమాని మాత్రం షారుక్.. తన కొత్త చిత్రాన్ని జనవరి 1న ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్లో సందేశం పంపాడు.
షారుక్ ఎప్పడెప్పుడు తీపి కబురు చెబుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. 'జోరో' చిత్రం పరాజయం చవిచూడగా, అప్పటి నుంచి బాద్షా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఫలితంగా ఆభిమానులు "వుయ్ వాంట్ అనౌన్స్మెంట్ ఎస్ఆర్కే" అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు.
"జనవరి 1న మీరు తర్వాత చిత్రాన్ని ప్రకటించకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా. మరోసారి చెబుతున్నా ఆత్మహత్య చేసుకుంటా"
- ట్విట్టర్లో ఓ అభిమాని" ఖాన్ సాబ్ 'జీరో' వచ్చి ఏడాదవుతోంది. అప్పటి నుంచి మాకు ఎలాంటి ఉత్సాహం లేదు. ఇప్పటికైనా మీరు అభిమానులకు తీపి కబురు చెబుతారని ఆశిస్తున్నా. సినీ పరిశ్రమకే మీరో ప్రత్యేక ఆకర్షణ."
- మరో అభిమాని
బాలీవుడ్ బాద్షా తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఇతడి తర్వాతి సినిమా తమిళ దర్శకుడు అట్లీ, తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకేలలో ఎవరో ఒకరితో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి అభిమానులకు షారుక్ తీపి కబురు ఎప్పుడు చెప్తాడో వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: వేసవిలో మెగా మేనల్లుడి 'ఉప్పెన'!