తన రూమ్మేట్ ప్రీతి.. ఆమె తల్లి స్నేహలత ఇద్దరూ కలిసి దారుణంగా చితకబాదారని, తన ముఖాన్ని నాశనం చేయాలని చూశారని ముంబయి ఓషినారా పోలీసు స్టేషన్లో నళిని అనే నటి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.
"ప్రీతి నా ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే ఆమె తల్లి స్నేహలత వచ్చారు. రూమ్ షిఫ్టింగ్‌కు సాయపడేందుకు వచ్చిందేమో అని అనుకున్నాను. మా అమ్మానాన్న వస్తున్నారు రూమ్ ఖాళీ చేయమని అడిగాను. గత వారం స్నేహలత నాతో కారణం లేకుండానే వాదించి.. అసభ్యంగా మాట్లాడింది. అనంతరం ప్రీతి కూడా నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. నేను వివరణ ఇచ్చే లోపు వాళ్ల అమ్మ గ్లాసుతో నాపై దాడి చేసింది. ఇద్దరూ నాపై దాడి చేసి నా ముఖాన్ని నాశనం చేయాలని చూశారు" -నళిని, హిందీ బుల్లితెర నటి
కొన్నేళ్ల క్రితం నళిని, ప్రీతి ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. అనంతరం నళిని మరో ఇంటికి మారిపోయి ఒంటరిగా నివసిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇల్లు దొరకడం లేదని, కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని అడిగింది ప్రీతి. ఎన్నిరోజులైనా రూమ్ ఖాళీ చేయకపోగా.. తల్లిదండ్రులు వస్తున్నారని బయటకు వెళ్లమంటే దాడి చేశారని నళిని పోలీసులకు తెలిపింది.
ఇది చదవండి: మంచు విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్'